టీడీపీ నేత‌లు క్ష‌మాప‌ణ చెబుతారా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సంబురాలల్లో తెలుగుదేశం నేత‌లు పాల్గొనే విష‌యంలో ఆయ‌న కొన్ని ష‌ర‌తులు, డిమాండ్లు విధించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాల్లో పాల్గొనాలంటే.. ముందు తెలుగుదేశం నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మొన్న జ‌రిగిన మ‌హానాడులో తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా ప‌లు తీర్మానాలు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో  సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకునేలా కుట్ర‌లు చేస్తోన్న చంద్ర‌బాబు అనుచ‌రుల‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్స‌వాల్లో […]

Advertisement
Update:2016-06-01 06:35 IST
తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సంబురాలల్లో తెలుగుదేశం నేత‌లు పాల్గొనే విష‌యంలో ఆయ‌న కొన్ని ష‌ర‌తులు, డిమాండ్లు విధించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాల్లో పాల్గొనాలంటే.. ముందు తెలుగుదేశం నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మొన్న జ‌రిగిన మ‌హానాడులో తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా ప‌లు తీర్మానాలు చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకునేలా కుట్ర‌లు చేస్తోన్న చంద్ర‌బాబు అనుచ‌రుల‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్స‌వాల్లో పాల్గొనే హ‌క్కులేద‌ని శ్రీ‌నివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ సంబురాల్లో పాల్గొంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. అయితే త‌ప్ప‌కుండా క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అదే స‌మ‌యంలో ఆయ‌న వ్యాఖ్య‌ల తీవ్ర‌త‌ను పెంచారు. తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ర‌క్త‌పాత‌మే జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. చంద్ర‌బాబు త‌న పెంపుడు కుక్క‌ల‌ను ఉసిగొల్పితే.. ఊరుకునేది లేద‌ని తామూ రెచ్చిపోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. తెలంగాణ నేత‌ల‌ను పెంపుడు కుక్క‌ల‌తో పోల్చ‌డంపై ప‌లువురు టీడీపీ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌ను కుక్క‌ల‌తో పోల్చ‌డం ఏంట‌ని వాపోతున్నారు. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రిని రేవంత్ దూషించిన‌పుడు స్పందించ‌ని తెలంగాణ టీడీపీ నేత‌లు ఇప్పుడెలా స్పందిస్తున్నార‌ని గులాబీ నేత‌లు ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన సంబురాల్లో తెలుగుదేశం నేత‌లు పాల్గొంటారా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News