వివేకవంతమైన సలహా

పూర్వకాలం రాజులకు గురువులుండేవాళ్ళు. రాజకీయ విషయాల్లోనూ, ఆధ్యాత్మిక విషయాల్లో, వ్యక్తిగత సమస్యల్లోనూ వాళ్ళకి గురువులు సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పట్ల రాజులు భక్తి ప్రపత్తులతో మెలిగేవాళ్లు. అతను యువరాజుగా ఉన్నపుడు ఆ గురువు అతనికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఆ యువరాజుకు పట్టాభిషేకమై రాజయిన తరువాత గురువుగారి మీద గౌరవంతో తన భవనానికి దగ్గర్నే పెద్దఇల్లు కట్టించి గురువు గారికి తన సమీపంలోనే వసతి ఏర్పాట్లు చేశాడు. రాజు ప్రతిరోజూ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని కానీ రాచకార్యాలు మొదలుపెట్టేవాడు […]

Advertisement
Update:2016-05-31 18:32 IST

పూర్వకాలం రాజులకు గురువులుండేవాళ్ళు. రాజకీయ విషయాల్లోనూ, ఆధ్యాత్మిక విషయాల్లో, వ్యక్తిగత సమస్యల్లోనూ వాళ్ళకి గురువులు సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పట్ల రాజులు భక్తి ప్రపత్తులతో మెలిగేవాళ్లు.

అతను యువరాజుగా ఉన్నపుడు ఆ గురువు అతనికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఆ యువరాజుకు పట్టాభిషేకమై రాజయిన తరువాత గురువుగారి మీద గౌరవంతో తన భవనానికి దగ్గర్నే పెద్దఇల్లు కట్టించి గురువు గారికి తన సమీపంలోనే వసతి ఏర్పాట్లు చేశాడు.

రాజు ప్రతిరోజూ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని కానీ రాచకార్యాలు మొదలుపెట్టేవాడు కాడు. ఒకరోజు రాజు గురువుగారిని కలవడానికి వెళ్ళాడు. గురువుగారు కన్నీళ్ళు పెట్టుకుని కనిపించారు. రాజు దిగ్భ్రమ చెందారు. ‘గురువుగారూ! మీలాంటి జ్ఞాని ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమయింది? విషయమేమిటి? మిమ్మల్ని అంతగా కలచి వేసే విషయమేమిటి? దయచేసి చెప్పండి’ అన్నాడు.

గురువు ‘నాయనా! నాకు నా గురించి ఎప్పుడూ భయం లేదు. నీ గురించే భయం. అతి త్వరలో నీపైన దాడి జరగబోతోంది. నీ సన్నిహితులే నిన్ను చంపి రాజ్యాన్ని పాలించాలని కుట్రపన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండు. అసలు ఈ రాత్రికే నువ్వు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపో. విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు వెంట తీసుకుపో! సమయానికి నీకు పనికి వస్తాయి. కానీ నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. అలాగే ఈ కాగితం మీద నాలుగు మాటలు ఉన్నాయి. అవి పూర్వీకులు చెప్పిన వివేకవంతమైన సలహాలు. వాటిని చదివితే సందర్భానికి తగినట్లు నువ్వెలా నడచుకోవాలో నీకు తెలిసి వస్తుంది. మరిచిపోవద్దు’ అన్నాడు.

రాజు తన భవనానికి వెళ్ళి వజ్రాలు, నగలు తగిన మోతాదులో తీసుకుని రాజభవనాన్ని దాటి దూరప్రాంతం వేపు సాగాడు. అపరిచితమయిన ప్రదేశాల్లోకి ప్రవేశించాడు. అప్పుడు గురువుగారు తనకు ఇచ్చిన పేపర్‌ తీసుకుని అందులోని మొదటి వాక్యం చదివాడు.

అందులో ‘రాజకుమారా! నువ్వు కొత్త ప్రదేశాల్లోకి వెళతావు. అపరిచితుల్ని కలుస్తావు. నీకు పరిచయం లేని ప్రదేశాల్లో కొత్తవాళ్ళను నమ్మకు. మనం అలాంటి సందర్భాల్లో కేవలం మన మిత్రుల్ని నమ్మాలి. నిజానికి రక్తసంబంధీకుల్ని కూడా నమ్మకూడదు’ అని రాసి ఉంది.

ఆ మాటల్ని శ్రద్ధగా చదువుకుని ప్రతి పదాన్నీ మననం చేసుకున్నాడు. మళ్ళీ ఆ కాగితం భద్రంగా దాచుకున్నాడు.

అలా ఆగకుండా నడిచాడు. వెనకనించీ సూర్యోదయమైంది. ఎదురుగా గొప్ప మనోహరమైన లోయ. బాదాం చెట్లు, ఆపిల్‌చెట్లు, రకరకాల రంగులచెట్లు ఒకవేపు పసుపు పచ్చని ఆవాల పంట. రంగురంగుల పిట్టల కేరింతలు పచ్చిక ఒత్తుగా, పచ్చగా, దూరంగా మంచుదుప్పటి కప్పిన పర్వతాలు వీటన్నిట్నీ వెలిగిస్తున్న సూర్యకాంతి.

‘సృష్టిలో కాశ్మీర్‌కు సాటి వచ్చేది ఏదీ లేదు. ప్రపంచంలో స్వర్గమంటే కాశ్మీరే కదా!’ అనుకున్నాడు రాజు.

లోయలో సాగుతున్నాడు. కొన్ని గంటలు నడిచిన తర్వాత రోడ్డు పక్కన వేడివేడి చాయ్‌ పొగలు కమ్ముతూ కనిపించింది.అక్కడ చాయ్‌ అమ్మే వ్యక్తి కనిపించాడు. రాజు బల్లమీద కూచునిచాయ్‌ తాగాడు. వెచ్చటి టీ కడుపులో పడేసరికి రాజుకు నిద్ర వచ్చింది. కొద్దిసేపు అక్కడే బల్లకు ఆనుకుని కునుకు తీశాడు.

కొంతసేపటికి లేచి చీకటి పదేదాకా నడిచాడు. ఒక రెండంతస్థుల భవనంపై అంతస్థు నించీ దీపం వెలుగు కింద పశువులు. పై అంతస్థుకి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక వృద్ధ స్త్రీ తలుపు తెరిచింది. ఆహ్వానించింది. ఆమె కళ్ళల్లో దుర్మార్గం కనిపించింది. రాత్రికి బసచేయాలన్నాడు. ఆమె తప్పక అంది. పడకగది చూపింది. ఆమెను నీళ్ళు తెచ్చివ్వమన్నాడు. ఆమె వెళ్లగానే తలుపు మూసుకుని పడక పరీక్షించాడు. పడక కింద ఖాళీగా ఉంది. పడుకుంటే లోపలికి పడిపోయేట్లు ఉంది. బస చేయడానికి వచ్చిన వాళ్ళని దోచుకుంటూ వృద్ధురాలు కాలక్షేపం చేస్తుందని తెలిసింది.

రాజు ఆగ్రహంతో వృద్ధురాలిని బంధించాడు. అక్కడి నించీ బయటపడి దగ్గర్లోని ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఆయన చిన్ననాటి మిత్రులున్నారు. వాళ్ళు ఆహ్వానించారు. విషయం తెలుసుకున్నారు. దూరపు బంధువుల్ని కలిశాడు కానీ వాళ్ళు మొహం చాటు వేశారు. తన గురువు కాగితంపై రాసిన మాటలు ఎంత వివేకం నిండినవో గ్రహించాడు.

మిత్రుల సాయంతో పొరుగుదేశం రాజును కలిసి తన పరిస్థితి వివరించాడు. ఆ రాజు సైనిక సాయం చేస్తానన్నాడు. తన రాజ్యాన్ని ఆక్రమించుకుని పాలిస్తున్న మంత్రిపై దండెత్తి మంత్రిని హతమార్చి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. తన గురువుకు ప్రణమిల్లి కృతజ్ఞత ప్రకటించాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News