బ్రహ్మణితో అలా గడపాలని ఉంది " లోకేష్
చంద్రబాబే కాదు ఆయన కుమారుడు లోకేష్ కూడా కుటుంబంతో గడపలేక బాధపడుతున్నట్టుగా ఉన్నారు. తన మనవడితో గడపలేకపోతున్నానని ప్రతివేదికపైనా చంద్రబాబు చెప్పుకుని బాధపడుతుంటారు. తాజాగా విజయవాడలో జరిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్ దంపతుల షష్టి పూర్తికి హాజరైన లోకేష్… తన బాధను చెప్పారు. బుద్దప్రసాద్ దంపతులను చూస్తుంటే తనకు బ్రహ్మణితో అలా గడపాలని ఉందని చెప్పారు. బ్రహ్మణితో గడిపేందుకు సమయం చిక్కడం లేదట. సరదాగానే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో తెలుగు భాషా సాంస్కృతిక […]
చంద్రబాబే కాదు ఆయన కుమారుడు లోకేష్ కూడా కుటుంబంతో గడపలేక బాధపడుతున్నట్టుగా ఉన్నారు. తన మనవడితో గడపలేకపోతున్నానని ప్రతివేదికపైనా చంద్రబాబు చెప్పుకుని బాధపడుతుంటారు. తాజాగా విజయవాడలో జరిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్ దంపతుల షష్టి పూర్తికి హాజరైన లోకేష్… తన బాధను చెప్పారు. బుద్దప్రసాద్ దంపతులను చూస్తుంటే తనకు బ్రహ్మణితో అలా గడపాలని ఉందని చెప్పారు. బ్రహ్మణితో గడిపేందుకు సమయం చిక్కడం లేదట. సరదాగానే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికీ హాజరైన లోకేష్… తెలుగు జాతి గురించి మాట్లాడితే గుర్తుకొచ్చేది ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పారు. ఈ సందర్బంగా లోకేష్‌ను సీనియర్ నేత, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఆకాశానికెత్తేశారు. తెలుగు జాతి జ్యోతి లోకేష్ చేతిలో ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనయుడు ఎంతో సంస్కారంతో పెరిగారని బుద్దప్రసాద్ చెప్పారు.
Click on Image to Read: