ఈరోజునుంచి అన్ని ధరలూ పెరుగుతాయి

జూన్‌ 1వ తారీఖునుంచి సర్వీస్‌ ట్యాక్స్‌ మరో అర శాతం పెరుగుతుంది. దాంతో ఇక మొత్తం 15 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ను ఈరోజు నుంచి మనం చెల్లించాల్సి వుంటుంది. కేంద్రప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన అర శాతం కృషి కళ్యాణ్‌ సెస్‌ ఈరోజు నుంచి సర్వీస్‌ ట్యాక్స్‌కు జత అవుతుంది. ప్రభుత్వాలు సంపన్నులనుంచి, పెద్దమొత్తాలు సంపాదించేవారి నుంచి, విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారినుంచి డైరెక్ట్‌ పన్నుల రూపంలో వసూలు చేయడం క్రమీణా తగ్గించి ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌లమీద పడ్డాయి. దాంతో […]

Advertisement
Update:2016-05-31 18:29 IST

జూన్‌ 1వ తారీఖునుంచి సర్వీస్‌ ట్యాక్స్‌ మరో అర శాతం పెరుగుతుంది. దాంతో ఇక మొత్తం 15 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ను ఈరోజు నుంచి మనం చెల్లించాల్సి వుంటుంది. కేంద్రప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన అర శాతం కృషి కళ్యాణ్‌ సెస్‌ ఈరోజు నుంచి సర్వీస్‌ ట్యాక్స్‌కు జత అవుతుంది.

ప్రభుత్వాలు సంపన్నులనుంచి, పెద్దమొత్తాలు సంపాదించేవారి నుంచి, విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవారినుంచి డైరెక్ట్‌ పన్నుల రూపంలో వసూలు చేయడం క్రమీణా తగ్గించి ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌లమీద పడ్డాయి. దాంతో నిరుపేదలుకూడా వాళ్లకు తెలియకుండానే పెద్దమొత్తంలో ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తుంది. తిండికిలేనివారికి కూడా ఈ పన్నుల బెడద తప్పడం లేదు. మనం అనారోగ్యం పాలై మందులు కొనుకున్నా వాటిమీద ధనవంతులతో సమానంగా తిండికిలేనివాడు కూడా ఒకేవిధమైన పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఫోన్‌ బిల్లు చెల్లించినా, ప్రయాణాలు చేసినా, బ్యాంక్‌ లావాదేవీలు జరిపినా ఒకటేమిటి ఏమి కొనాలన్నా ఏ పని చేయాలన్నా ఈ సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి వస్తోంది. కుహనా మేధావులు మన ఆర్ధికమంత్రులు అయినప్పటినుంచి పేదలను పిండడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధనవంతులకు డైరెక్ట్‌ ట్యాక్స్‌లలో విపరీతంగా రాయితీలు ఇచ్చే ఈ ఆర్ధికమంత్రులు పేదల కడుపుకొట్టి ఖజానా నింపుతున్నారు. అదే ఈ దేశ దౌర్భాగ్యం.

Tags:    
Advertisement

Similar News