చరిత్ర నుంచి పాఠాలు నేర్వలేదా?
రాయలసీమలో కొమ్ములు తిరిగిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇప్పుడు ఇళ్ల వద్ద శాంతి కపోతాలను ఎగరేసుకుంటున్నారు. ఫ్యాక్షన్ వద్దు బాబోయ్ అంటున్నారు. కారణం ఒకడిని చంపిన వాడు తిరిగి అదే ఫ్యాక్షన్‌లోనే చనిపోవడం అన్న సింపుల్ పాయింట్. అందుకే ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో అల్లాడిన సీమ గ్రామాలు ఇప్పుడు ఉన్నదాంతోనే ప్రశాంతంగా బతుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికే ఫ్యాక్షన్‌నే ఫ్యాషన్‌గా భావిస్తూ బతుకున్నాయి. అలాంటి ప్రాంతాంలో అనంతపురం జిల్లాలోని పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు […]
రాయలసీమలో కొమ్ములు తిరిగిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇప్పుడు ఇళ్ల వద్ద శాంతి కపోతాలను ఎగరేసుకుంటున్నారు. ఫ్యాక్షన్ వద్దు బాబోయ్ అంటున్నారు. కారణం ఒకడిని చంపిన వాడు తిరిగి అదే ఫ్యాక్షన్‌లోనే చనిపోవడం అన్న సింపుల్ పాయింట్. అందుకే ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో అల్లాడిన సీమ గ్రామాలు ఇప్పుడు ఉన్నదాంతోనే ప్రశాంతంగా బతుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికే ఫ్యాక్షన్‌నే ఫ్యాషన్‌గా భావిస్తూ బతుకున్నాయి. అలాంటి ప్రాంతాంలో అనంతపురం జిల్లాలోని పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పరిటాల శ్రీరామ్ వ్యవహారం పదేపదే చర్చనీయాంశమవుతోంది.
రాప్తాడు నియోజకవర్గంలో తమను ఎదురించేవారే ఉండకూడదన్నట్టుగా పరిటాల కుటుంబం రాజ్యమేలుతోందన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. తాజాగా సోమవారం జరిగిన సంఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. టీడీపీ నుంచి కొందరు ఇటీవల వైసీపీలో చేరుతున్నారు. అలాంటి వారు ఎందుకు పార్టీ వీడుతున్నారన్నది పక్కనపెడితే అలా జరగడాన్ని పరిటాల వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే తమ వారిని పార్టీలో చేర్చుకుంటున్న నేతలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు దిగుతున్నారు. మామిళ్లపల్లి వద్ద దాదాపు 50 మంది పరిటాల శ్రీరామ్ అనుచరులు వైసీపీ నేతలు సూర్యనారాయణరెడ్డి, జగన్నాథరెడ్డి, సుబ్బిరెడ్డిపై దాడి చేశారు. కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఇంత వరకు ఒక ఎత్తు. కానీ గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్సపొందుతుంటే తిరిగి దాడి చేశారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిపై దాడి చేసి పర్నిచర్ ధ్వంసం చేసి, చికిత్సపొందుతున్న వారిపై దాడులకు దిగడం ఆశ్చర్యమే.ఇక్కడ మరో విషయం ఏమిటంటే… టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిపై పడి బీభత్సం సృష్టిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు (డీజీపీ సొంత జిల్లా కూడా అనంతపురమే) అనంతపురం పట్టణంలోనే ఉన్నారు. ఆస్పత్రికి దగ్గర్లోనే ఎస్పీ కార్యాలయం కూడా ఉంటుంది. అయినా అధికారపార్టీ వారు అవన్నీ పట్టించుకోకుండా దాడి చేశారంటే ఏమనుకోవాలి?. శాంతిభద్రతలు బతికే ఉన్నాయానుకోవాలా?. డీజీపీ నగరంలో ఉన్నారంటే పోలీసుయంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా బాస్ వద్ద పరువు పోతుందని భయంతో డ్యూటీ చేస్తుంటారు. కానీ ఆస్పత్రిపై దాడి సమయంలో మాత్రం ఆ భయం ఎవరిలోనూ కనిపించలేదు.
డీజీపీ అంటే పరిటాల అనుచరులకు లెక్కలేకపోవడానికి కారణం కూడా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ రాముడు, పరిటాల కుటుంబసభ్యులు వరుసలు పెట్టి పిలుచుకుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఒకసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకులు కూడా ప్రస్తావించారు. డీజీపీ వరుసైన వారుకావడంతోనే పోలీసులన్నా, చట్టాలన్నా పరిటాల వర్గానికి లెక్కలేకుండా పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న డీజీపీ అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సొంత జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పట్టిపీడిస్తున్న ముఠా తగాదాల నివారణలో మాత్రం శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తండ్రి వేసిన రాజకీయ పునాదులు ఆసరాగా రాజకీయం చేయాల్సిన పరిటాల శ్రీరామ్, ఆయన ప్రత్యర్థులు కూడా ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని జిల్లావాసులు కూడా కోరుతున్నారు.
Click on Image to Read: