అమిత్ షాలో హాస్యపు కోణం!
చేపకు ఈత రాదంటే నమ్మవచ్చు.. చార్లీ చాప్లిన్‌కు నటన రాదంటే నమ్మవచ్చు.. హిట్లర్ కు జాతి విద్వేషం లేదంటే కొంచెం కష్టమైనా నమ్మవచ్చు.. ఇంకాస్త ముందుకెళ్లి.. రజనీకాంత్ కు స్టైల్ తెలీయదన్నా.. నమ్మవచ్చు.. కానీ.. కానీ.. బీజేపీకి ప్రచారం చేసుకోవడం తెలియదంటే.. ఈ దేశంలో చిన్నపిల్లాడు కూడా నమ్మడంటే అతిశయోక్తి కాదు.. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షానే కావడం విశేషం. కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా […]
Advertisement
చేపకు ఈత రాదంటే నమ్మవచ్చు..
చార్లీ చాప్లిన్‌కు నటన రాదంటే నమ్మవచ్చు..
హిట్లర్ కు జాతి విద్వేషం లేదంటే కొంచెం కష్టమైనా నమ్మవచ్చు..
ఇంకాస్త ముందుకెళ్లి.. రజనీకాంత్ కు స్టైల్ తెలీయదన్నా.. నమ్మవచ్చు..
కానీ.. కానీ.. బీజేపీకి ప్రచారం చేసుకోవడం తెలియదంటే.. ఈ దేశంలో చిన్నపిల్లాడు కూడా నమ్మడంటే అతిశయోక్తి కాదు.. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షానే కావడం విశేషం. కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా అమిత్ షా హైదరాబాద్‌లో ప్రసంగించారు. తాము ఎన్నో ప్రజారంజకమైన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని.. వాటిలో కేవలం ప్రజా సంక్షేమం కోణం మాత్రమే ఉందన్నారు.. అయితే.. తమకు వీటిపై ప్రచారం ఎలా చేసుకోవాలో తెలియదని వాపోయారు. పాపం! కానీ, ఎప్పుడూ సీరియస్‌గా ఉండే.. అమిత్‌షాలో ఈ హాస్యపు కోణాన్ని విలేకరులు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.
వీటికి సమాధానం ఎవరు చెబుతారు?
2014 ఎన్నికల సమయంలో కేవలం ఛాయ్‌వాలా ప్రచారం కోసం రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు.
నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు రూ.10,000 కోట్లు : కాంగ్రెస్ నేత సుర్జీత్‌వాలా ఆరోపణ
కమలనాథుల పార్టీ ప్రచారం ఖర్చుపై ఈసీకి లెక్క చెప్పిన ఖర్చు రూ.714 కోట్లు
అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రచారార్భాటాల కోసం చేసిన ఖర్చు రూ.1000 కోట్లు: ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణ
Advertisement