సిరిసిల్ల నేత‌కు న‌జ‌రానా!

అగ్గిపెట్టెలో ఇమిడే చీర‌ను నేయ‌డం సిరిసిల్ల నేత‌న్న‌ల ప‌నితనానికి నిద‌ర్శ‌నం. ఒక‌ప్పుడు సిరిసిల్ల వ‌స్ర్తాలు దేశ‌మంతా ప్ర‌సిద్ధి చెందాయి. ప్ర‌పంచీక‌ర‌ణ కార‌ణంగా వీరి మ‌గ్గం న‌డుం విరిగింది. వీరి వ‌స్ర్తాల‌కు ఆద‌ర‌ణ క‌రువ‌వ‌డంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. ఒక‌వేళ అప్పులు చేసి వ‌స్ర్తాలు నేసినా.. కొనేవారు లేక‌.. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ఆదుకునేందుకు తెలంగాణ స‌ర్కారు ఓ ప్ర‌య‌త్నం చేసింది. రాష్ర్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల స్కూలు యూనిఫాంలకు సిరిసిల్ల […]

Advertisement
Update:2016-05-28 02:30 IST
అగ్గిపెట్టెలో ఇమిడే చీర‌ను నేయ‌డం సిరిసిల్ల నేత‌న్న‌ల ప‌నితనానికి నిద‌ర్శ‌నం. ఒక‌ప్పుడు సిరిసిల్ల వ‌స్ర్తాలు దేశ‌మంతా ప్ర‌సిద్ధి చెందాయి. ప్ర‌పంచీక‌ర‌ణ కార‌ణంగా వీరి మ‌గ్గం న‌డుం విరిగింది. వీరి వ‌స్ర్తాల‌కు ఆద‌ర‌ణ క‌రువ‌వ‌డంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. ఒక‌వేళ అప్పులు చేసి వ‌స్ర్తాలు నేసినా.. కొనేవారు లేక‌.. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ఆదుకునేందుకు తెలంగాణ స‌ర్కారు ఓ ప్ర‌య‌త్నం చేసింది. రాష్ర్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల స్కూలు యూనిఫాంలకు సిరిసిల్ల నేత కార్మికుల దుస్తులను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్వీఎం (రాజీవ్‌ విద్యా మిషన్‌) ద్వారా 70 లక్షల మీటర్ల దుస్తులను కోనుగోలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం ఏకంగా రూ.80 కోట్ల రూపాయలు వెచ్చించనుండటం విశేషం. ఈ పనుల్లో కనీసం రూ.30 కోట్ల మేర ఉపాధి పనులు సిరిసిల్ల కార్మికులకు దక్కనుండటం విశేషం. గతంలో వీరికి ఇంత పెద్ద స్థాయిలో ఆర్డర్లు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ.
సిరిసిల్ల నేత కార్మికులకు ఇంత భారీ కాంట్రాక్టు దక్కడం వెనక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ కృషి ఉండటం విశేషం. అందుకే, ఈ పనులు కేటాయింపు తమకే దక్కేలా చేసినందుకు వారంతా మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏటా ఇదే విధంగా ప్రభుత్వం ఉపయోగించే కార్యక్రమాలకైనా తమకు పనులు అప్పగిస్తే.. ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించినట్లవుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News