టన్ను ఉల్లిపాయలు రూపాయి

మహారాష్ట్రకు చెందిన దేవీదాస్‌ అనే రైతు 80,000 రూపాయలు ఖర్చుపెట్టి రెండు ఎకరాలలో ఉల్లిపాయలు పండించాడు. పంట చేతికి వచ్చింది. ఒక టన్ను ఉల్లిపాయల్ని 18 బస్తాలలో నింపి దగ్గరలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీకి తీసుకువెళ్లాడు. ట్రక్కులో ఈ ఉల్లిపాయలను తీసుకొని వెళ్లడానికి ఆయనకు 1,320 రూపాయలు అయింది. ట్రక్కు నుంచి ఉల్లిపాయల బస్తాలను దింపడానికి 92 రూపాయలు తీసుకున్నారు. మార్కెట్‌ కమిటీ వాళ్లకు 52 రూపాయలు చెల్లించాల్సివచ్చింది. అంటే సరుకును మార్కెట్‌కి తీసుకువెళ్లడానికి మొత్తం […]

Advertisement
Update:2016-05-26 04:01 IST

మహారాష్ట్రకు చెందిన దేవీదాస్‌ అనే రైతు 80,000 రూపాయలు ఖర్చుపెట్టి రెండు ఎకరాలలో ఉల్లిపాయలు పండించాడు. పంట చేతికి వచ్చింది. ఒక టన్ను ఉల్లిపాయల్ని 18 బస్తాలలో నింపి దగ్గరలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీకి తీసుకువెళ్లాడు. ట్రక్కులో ఈ ఉల్లిపాయలను తీసుకొని వెళ్లడానికి ఆయనకు 1,320 రూపాయలు అయింది. ట్రక్కు నుంచి ఉల్లిపాయల బస్తాలను దింపడానికి 92 రూపాయలు తీసుకున్నారు. మార్కెట్‌ కమిటీ వాళ్లకు 52 రూపాయలు చెల్లించాల్సివచ్చింది. అంటే సరుకును మార్కెట్‌కి తీసుకువెళ్లడానికి మొత్తం 1,464 రూపాయలు రైతుకు ఖర్చయింది.

మార్కెట్‌ కమిటీ వాళ్లు కిలో రూపాయి అరవైపైసల చొప్పున కొన్నారు. రైతుకు మొత్తం 1,523 రూపాయలు చేతికివచ్చింది. ఖర్చులుపోను రైతుకు టన్నుకు 59 రూపాయలు మిగిలింది. మార్కెట్‌ యాడ్‌ నుంచి ఇంటికి వెళ్లడానికి ఛార్జీలు తీసేస్తే రైతుకు టన్నుకు ఒక రూపాయి మిగిలింది. కాయకష్టం చేసి రాత్రనక పగలనకా శ్రమపడి ఉల్లి సాగుచేసిన ఆ కుటుంబం టన్ను ఉల్లిపాయలు అమ్మి ఒక్క రూపాయితో ఇంటికి చేరిన కుటుంబ పెద్దను చూసి కళ్లనీళ్ల పర్యంతం అయింది.

Tags:    
Advertisement

Similar News