అదే జరిగితే జలీల్‌ఖాన్‌ ఏమైపోవాలి ?

పక్క చెరువులో చేపలను పట్టుకొచ్చి సొంత చెరువులో వదులుకుంటున్న చంద్రబాబు… ఆ తర్వాత పాత చేపల చేతిలో కొత్త చేపలు ఎలా ఇబ్బందిపడుతున్నది మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. స్మూత్‌గా ఉండే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అయితే టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పేరు ముందుంది. మినీమహానాడుకు వస్తే చితక్కొడుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్ హెచ్చరించడంతో మినీమహానాడుకు కూడా రాలేకపోయాడు. పయ్యావుల కేశవ్‌ కూడా అత్తార్‌ను […]

Advertisement
Update:2016-05-26 08:52 IST

పక్క చెరువులో చేపలను పట్టుకొచ్చి సొంత చెరువులో వదులుకుంటున్న చంద్రబాబు… ఆ తర్వాత పాత చేపల చేతిలో కొత్త చేపలు ఎలా ఇబ్బందిపడుతున్నది మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. స్మూత్‌గా ఉండే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అయితే టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పేరు ముందుంది. మినీమహానాడుకు వస్తే చితక్కొడుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్ హెచ్చరించడంతో మినీమహానాడుకు కూడా రాలేకపోయాడు. పయ్యావుల కేశవ్‌ కూడా అత్తార్‌ను అవమానిస్తూ పదేపదే వ్యాఖ్యలుచేస్తున్నారు. దీంతో అత్తార్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

ఈనేపథ్యంలో అత్తార్‌ను పార్టీలోకి తీసుకొచ్చిన ఒక వర్గం ఆయనలో ఆత్మవిశ్వాసం నింపి వైరి వర్గాన్ని బెదరగొట్టేందుకు వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా అత్తార్‌ బాషాకు మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కుతోందంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అనుకూల పత్రిక కూడా అత్తార్‌కు మంత్రి పదవి రాబోతోందని కథనంరాసింది. అయితే ఇలా చేయడం ద్వారా అత్తార్‌పై అటాక్‌ చేయాలంటే భయపడే పరిస్థితిని కల్పించాలని టీడీపీలోని ఒక వర్గం భావిస్తోందట. పయ్యావుల కేశవ్, కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్ ఇటీవల బాగా సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో కందికుంట పరిటాల టీంలో ఉండేవారు. కేశవ్, ప్రసాద్ ఒకటి కావడం జీర్ణించుకోలేక పోతున్న మంత్రి అనుచరులు అత్తార్‌కు మంత్రిపదవి అంటూ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ ప్రచారం చూసి అత్తార్‌కు మంత్రి పదవి ఇస్తే మరి జలీల్‌ఖాన్ ఏమైపోవాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవిపై టన్నులకొద్దీ ఆశలు పెట్టుకున్న జలీల్‌ఖాన్… అందుకు తగ్గట్టుగానే చంద్రబాబుపై ఈగ వాలనివ్వడం లేదు. పార్టీ మారి కూడా వైసీపీపైనే ఎదురుదాడి చేస్తున్న వారిలో జలీల్‌ఖానే ముందున్నారు. మంత్రి పదవి కోసమే ఆయన ఇలా రిస్క్ తీసుకుని దూకుడు ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పడు హఠాత్తుగా అత్తార్ బాషాను మైనార్టీ కోటాలో మంత్రిని చేస్తే జలీల్‌ ఖాన్ ఏమైపోవాలి?. అయినా కర్నూలులో భూమా, గోదావరి జిల్లాలో నెహ్రు, విజయవాడలో జలీల్‌ఖాన్, అనంతపురంలో అత్తార్‌, కడపలో ఆది వామ్మో లిస్ట్ పెద్దగానే ఉంది. వీరిలో ఎవరికి బాబుగారి స్పెషల్ ప్రసాదం అందుకునే ప్రాప్తం ఉందో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News