తెలంగాణలో 40 ఎంపీ స్థానాలు..రండి గెలవండి

తెలంగాణవర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి…చంద్రబాబు తరహాలోనే ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీస్థానాలు పెరుగుతాయంటూ ప్రతిపక్షనాయకులకు చంద్రబాబు గాలం వేస్తుండగా… రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తెలంగాణలో ఎంపీ స్థానాలు 40కి పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో సీనియర్లులేరని యువకులు పార్టీలో జాయిన్ కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 30 మంది యువకులకు ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ వంటివారు సైతం టీడీపీ నుంచి ఎదిగిన వారే తప్ప వారేం పెద్ద మొనగాళ్లు […]

Advertisement
Update:2016-05-24 15:34 IST
తెలంగాణలో 40 ఎంపీ స్థానాలు..రండి గెలవండి
  • whatsapp icon

తెలంగాణవర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి…చంద్రబాబు తరహాలోనే ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీస్థానాలు పెరుగుతాయంటూ ప్రతిపక్షనాయకులకు చంద్రబాబు గాలం వేస్తుండగా… రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తెలంగాణలో ఎంపీ స్థానాలు 40కి పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో సీనియర్లులేరని యువకులు పార్టీలో జాయిన్ కావాలని పిలుపునిచ్చారు.

దాదాపు 30 మంది యువకులకు ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ వంటివారు సైతం టీడీపీ నుంచి ఎదిగిన వారే తప్ప వారేం పెద్ద మొనగాళ్లు కాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఆ సంఖ్య 40కి పెరిగితే మరి దేశ వ్యాప్తంగా మొత్తం ఎంపీల సంఖ్య వెయ్యి దాటిపోవడం ఖాయం. అసలు లోక్ సభ స్థానాలు పెరుగుతాయని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసో!.

భారీ గాలివానకు హైదరాబాద్‌లో విద్యుత్ వ్యవస్థ స్తంభించినా, చెట్లు రోడ్లపై కూలినా పట్టించుకునే నాథుడే లేడని రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరాన్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు. అదే విశాఖలో హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు తమ నాయకుడు చంద్రబాబు అక్కడే ఉండి సమస్యలు పరిష్కరించారని చెప్పుకొచ్చారు.

యాపిల్ సంస్థ సీఈవో నగరానికి వచ్చిన సమయంలో కొడుకు సెల్ఫీలతో, తండ్రి సెల్ఫ్ డబ్బాతో డంబాలు పలికారని అయినప్పటికీ పెద్ద ప్రాజెక్టు మాత్రం బెంగళూరుకు వెళ్లిపోయిందదన్నారు. హైదరాబాద్ జిల్లాకార్యాలయంలో జరిగిన మినీమహానాడులో రేవంత్ రెడ్డి ఈవ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News