అందుకే ఆ ఒంటెకు అంత కోపం వచ్చింది!
రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో శనివారం ఒక ఒంటె తన యజమానిమీద దాడిచేసి ఆరుగంటలు వీరంగం సృష్టించింది. మంగ్టా అనే గ్రామానికి చెందిన ఊర్జారామ్, బంధువులు వచ్చిన హడావుడిలో పడి, తన ఒంటెని ఎండలో కట్టేసిన సంగతిని మర్చిపోయాడు. రాజస్థాన్‌లో అసలే ఎండలు బాగా మండిపోతుండటంతో ఆ ఒంటెకి తన యజమానిమీద పీకల్దాకా కోపం వచ్చింది. శనివారం రాత్రి ఎప్పుడో ఊర్జారామ్కి ఒంటె సంగతి గుర్తుకువచ్చింది. పరిగెత్తుకుని వెళ్లి దాని కాళ్లకు కట్టిన తాళ్లను ఊడదీసే ప్రయత్నం చేశాడు. […]
రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో శనివారం ఒక ఒంటె తన యజమానిమీద దాడిచేసి ఆరుగంటలు వీరంగం సృష్టించింది. మంగ్టా అనే గ్రామానికి చెందిన ఊర్జారామ్, బంధువులు వచ్చిన హడావుడిలో పడి, తన ఒంటెని ఎండలో కట్టేసిన సంగతిని మర్చిపోయాడు. రాజస్థాన్‌లో అసలే ఎండలు బాగా మండిపోతుండటంతో ఆ ఒంటెకి తన యజమానిమీద పీకల్దాకా కోపం వచ్చింది. శనివారం రాత్రి ఎప్పుడో ఊర్జారామ్కి ఒంటె సంగతి గుర్తుకువచ్చింది. పరిగెత్తుకుని వెళ్లి దాని కాళ్లకు కట్టిన తాళ్లను ఊడదీసే ప్రయత్నం చేశాడు. అంతే… ఆ ఒంటె ఒక్కసారిగా అతడిని తన మెడతో పైకెత్తి అవతల పడేసింది. అతని శరీరాన్ని కొరుకుతూ, తలమీద గట్టిగా కొట్టింది. పాతికమంది గ్రామీణులు వచ్చి ఆరుగంటల పాటు శ్రమపడితే కానీ దాన్ని శాంతింప చేయలేకపోయారు. గతంలో కూడా ఒకసారి ఈ ఒంటె ఊర్జారామ్ని ఇలాగే కొట్టిందని గ్రామస్తులు వెల్లడించారు. రాజస్థాన్లో దేశ సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న జవాన్లు సైతం తమ ఒంటెలను ఎండల నుండి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఒక ఒంటె తన వీపుమీద ఉన్న జవానుని తోసేసి నీడలోకి పరిగెత్తింది.