మాల్యాకు మ‌న్మోహ‌న్ షూరిటీ.. అకౌంట్లు ఫ్రీజ్, ల‌బోదిబోమంటున్న సింగ్

లిక్క‌ర్ డాన్ విజ‌య్‌మాల్యాకు 9 వేల కోట్ల రూపాయ‌ల అప్పులిచ్చి వాటిని వ‌సూలు చేసుకోలేక గోర్లు గిల్లుకుంటున్న బ్యాంకులు మ‌రోసారి త‌మ నిర్ల‌క్ష్యాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాయి. మాల్యాకు షూరిటీ ఉన్నారంటూ మ‌న్మోహ‌న్ సింగ్ అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారు. అయితే మ‌న్మోహ‌న్ సింగ్ అంటే మాజీ ప్ర‌ధాని కాదు. ఒక సాధార‌ణ రైతు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన రైతు మ‌న్మోహ‌న్ సింగ్… విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి గ్యారంటర్‌గా ఉన్నారంటూ అత‌డి అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ […]

Advertisement
Update:2016-05-21 10:04 IST

లిక్క‌ర్ డాన్ విజ‌య్‌మాల్యాకు 9 వేల కోట్ల రూపాయ‌ల అప్పులిచ్చి వాటిని వ‌సూలు చేసుకోలేక గోర్లు గిల్లుకుంటున్న బ్యాంకులు మ‌రోసారి త‌మ నిర్ల‌క్ష్యాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాయి. మాల్యాకు షూరిటీ ఉన్నారంటూ మ‌న్మోహ‌న్ సింగ్ అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారు. అయితే మ‌న్మోహ‌న్ సింగ్ అంటే మాజీ ప్ర‌ధాని కాదు. ఒక సాధార‌ణ రైతు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన రైతు మ‌న్మోహ‌న్ సింగ్… విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి గ్యారంటర్‌గా ఉన్నారంటూ అత‌డి అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా చేసింది. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కే అకౌంట్ ఫ్రీజ్ చేశామ‌ని లోక‌ల్ బ్రాంచ్ చెబుతోంది.

ఈ విష‌యం తెలుసుకున్న రైతు మ‌న్మోహ‌న్ ల‌బోదిబోమంటున్నారు. అస‌లు విజ‌య‌మాల్యా ఎవ‌రో త‌న‌కు తెలియదంటున్నారు. జీవితంలో తాను అసలు ముంబై న‌గ‌రాన్ని కూడా చూడ‌లేద‌న్నారు. ఇలా త‌న అకౌంట్లు ఫ్రీజ్ చేయ‌డం ఏమిట‌ని ఆందోళ‌న చెందుతున్నాడు. అస‌లు ఒక సాధార‌ణ రైతు షూరిటీ ఇస్తే విజ‌య‌మాల్యాకు బ్యాంకులు వేల కోట్ల రుణాలు ఇచ్చాయా. విన‌డానికే కామెడీగా ఉంది. బ్యాంకుల తీరు ఇలా ఉంది కాబ‌ట్టే.. విజ‌య‌మాల్యా వేల కోట్లు ఎగ్గొట్టినా చెవిలో పూలు పెట్టింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News