నా భార్య రాక‌పోయినా నేనోస్తున్నా- చంద్ర‌బాబు

ప్ర‌త్యేక హోదా అంశాన్ని చంద్ర‌బాబు మ‌రోసారి లైట్ తీసుకున్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల వ‌చ్చే ఉప‌యోగం ఏమిలేద‌న్న‌ట్టు మాట్లాడారు. హోదా ఉన్న ప‌ది రాష్ట్రాలు ఏం సాధించాయ‌ని చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో ప్ర‌శ్నించారు. ఆ ప‌ది రాష్ట్రాలు ఇప్ప‌టికీ వెనుక‌బ‌డే ఉన్నాయ‌న్నారు. ఏపీకి క‌రువు, తుఫానులు పెద్ద స‌మ‌స్య‌గా మారాయ‌ని చెప్పారు. ఇటీవల తుఫాను వ‌చ్చినా అది మ‌న‌ల్ని చూసి భ‌య‌ప‌డి వెళ్లిపోయింద‌ని విచిత్ర‌మైన స‌మాధానం చెప్పారు. ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27 నాటికి తాత్కాలిక […]

Advertisement
Update:2016-05-21 08:40 IST

ప్ర‌త్యేక హోదా అంశాన్ని చంద్ర‌బాబు మ‌రోసారి లైట్ తీసుకున్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల వ‌చ్చే ఉప‌యోగం ఏమిలేద‌న్న‌ట్టు మాట్లాడారు. హోదా ఉన్న ప‌ది రాష్ట్రాలు ఏం సాధించాయ‌ని చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో ప్ర‌శ్నించారు. ఆ ప‌ది రాష్ట్రాలు ఇప్ప‌టికీ వెనుక‌బ‌డే ఉన్నాయ‌న్నారు. ఏపీకి క‌రువు, తుఫానులు పెద్ద స‌మ‌స్య‌గా మారాయ‌ని చెప్పారు. ఇటీవల తుఫాను వ‌చ్చినా అది మ‌న‌ల్ని చూసి భ‌య‌ప‌డి వెళ్లిపోయింద‌ని విచిత్ర‌మైన స‌మాధానం చెప్పారు. ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27 నాటికి తాత్కాలిక రాజ‌ధానికి రావాల్సిందేన‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు. స‌చివాల‌యం త‌ర‌లింపు కోసం అవ‌స‌ర‌మైతే మ‌రో 300 కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు కూడా వెనుకాడ‌బోమ‌న్నారు.

విజ‌య‌వాడ‌కు త‌న భార్య రాక‌పోయినా తాను మాత్రం ఇక్క‌డికి వ‌చ్చి ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. వారంలో ఒక‌రోజు విజ‌య‌వాడ వచ్చి వెళ్తుంటారని బాబు వెల్లడించారు. ఇక‌పై ఏపీ ఆవిర్భావ దినోత్స‌వం ఉండ‌ద‌ని చెప్పారు. జ‌రిగిన అన్యాయం గుర్తు చేసేలా ఏటా దీక్ష‌లనే నిర్వ‌హిస్తామ‌న్నారు. జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఒక‌ మహానాయకుడు కర్నూలులో మాట్లాడారు, రాజకీయాలు తెలియవు, ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడుతారని విమ‌ర్శించారు. అభివృద్ధి సాధించడమనేది దొంగ లెక్కలు రాసుకున్నంత సులభం కాదని, కష్టపడితే అవుతుందని చంద్రబాబు అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News