రాజధాని రైతుపై మరో దుర్మార్గపు "లండన్" అస్త్రం

ఏపీ రాజధాని రైతుల హక్కులను ఎక్కడికక్కడ అణచివేస్తున్న ప్రభుత్వం మరో ప్రమాదకరమైన నిర్ణయానికి ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తోంది. సింగపూర్ కంపెనీలు పెట్టే కండిషన్లను గుడ్డిగా అంగీకరించేందుకు రెడీ అవుతోంది. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో న్యాయపరమైన వివాదాలు ఏర్పడితే స్థానిక కోర్టుల్లోనే తేల్చుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ అమరావతి రైతుల రెక్కలు నరికేందుకు వారు ప్రయాణించలేనంత దూరంలో లీగల్ కేసులు తీసుకెళ్లేందుకు సింగపూర్ కంపెనీలు దుర్మార్గమైన ఎత్తు వేశాయి. రాజధాని ప్రాంతంలో 1619 ఎకరాలను […]

Advertisement
Update:2016-05-15 13:43 IST

ఏపీ రాజధాని రైతుల హక్కులను ఎక్కడికక్కడ అణచివేస్తున్న ప్రభుత్వం మరో ప్రమాదకరమైన నిర్ణయానికి ఆమోదం తెలిపే దిశగా అడుగులు వేస్తోంది. సింగపూర్ కంపెనీలు పెట్టే కండిషన్లను గుడ్డిగా అంగీకరించేందుకు రెడీ అవుతోంది. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో న్యాయపరమైన వివాదాలు ఏర్పడితే స్థానిక కోర్టుల్లోనే తేల్చుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ అమరావతి రైతుల రెక్కలు నరికేందుకు వారు ప్రయాణించలేనంత దూరంలో లీగల్ కేసులు తీసుకెళ్లేందుకు సింగపూర్ కంపెనీలు దుర్మార్గమైన ఎత్తు వేశాయి.

రాజధాని ప్రాంతంలో 1619 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీకి బాబు సర్కార్ కట్టబెడుతోంది. ఇందుకోసం సింగపూర్ కంపెనీలు సమర్పిస్తున్న ప్లానింగ్‌లో అనేక కండిషన్లు పెట్టారు. అందులో ముఖ్యంగా 1619 ఎకరాల విషయంలో రైతుల నుంచి గానీ, మరొకరినుంచి గానీ వివాదాలు చెలరేగితే వాటిని లండన్ కోర్టుల్లోనే ఎదుర్కొవాలన్న నిబంధనను రూపొందించారు. అంటే ఒక రైతు తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలంటే మన దేశంలో కాకుండా లండన్‌ వెళ్లి అక్కడి కోర్టుల్లో పోరాటం చేయాలన్న మాట. ఈ నిబంధన చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇది దేశాన్ని తాకట్టుపెట్టడం వంటిదేనని మండిపడుతున్నారు.

స్విస్ చాలెంజ్‌లో 1619 ఎకరాలు అభివృధ్ధి చేసేందుకు వస్తున్న సింగపూర్ కంపెనీలు ఇలాంటి గొంతెమ్మ కోర్కెలను చాలానే ప్రభుత్వం ముందుంచాయి. ప్రాజెక్టు నిర్మాణంలో స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో పాటు అన్ని అనుమతులు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే ఏపీ తాము బతకలేక రాజధాని కట్టుకోవడం చేత గాక తమ వెంట పడుతోందన్న భావనతో సింగపూర్ సంస్థలున్నట్టుగా అర్థమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News