స్పీకర్ కోడెల పరిస్థితి అంత దారుణంగా ఉందా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పదవిగా స్పీకర్ స్థానాలు తయారయ్యాయి. ఒకప్పుడు స్వతహాగా వ్యవహరించే పవిత్రమైన స్పీకర్లు ఇప్పుడు ముఖ్యమంత్రుల కనుసన్నల్లో బతకాల్సిన పరిస్థితి దాపురించిందన్న భావన అందరిలోనూ ఉంది. సీనియర్ నాయకుడిగా పేరున్న కోడెల శివప్రసాదరావు కూడా ఈ విమర్శలకు అతీతులు కాకుండాపోయారు. తన తండ్రితో కలిసి రాజకీయం చేసిన కోడెలపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఘాటైన కామెంట్స్ చేశారు. పరోక్షంగా స్పీకర్ ఒక చేతకాని వ్యక్తి అని తేల్చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి […]
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పదవిగా స్పీకర్ స్థానాలు తయారయ్యాయి. ఒకప్పుడు స్వతహాగా వ్యవహరించే పవిత్రమైన స్పీకర్లు ఇప్పుడు ముఖ్యమంత్రుల కనుసన్నల్లో బతకాల్సిన పరిస్థితి దాపురించిందన్న భావన అందరిలోనూ ఉంది. సీనియర్ నాయకుడిగా పేరున్న కోడెల శివప్రసాదరావు కూడా ఈ విమర్శలకు అతీతులు కాకుండాపోయారు. తన తండ్రితో కలిసి రాజకీయం చేసిన కోడెలపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఘాటైన కామెంట్స్ చేశారు. పరోక్షంగా స్పీకర్ ఒక చేతకాని వ్యక్తి అని తేల్చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఇతరపార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కనుసన్నల్లో పనిచేసే స్పీకర్ కూడా ఏం చేయగలరు అంటూ ఎద్దేవా చేశారు.
తన హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తే మూడు వారాల్లోనే నోటీసులు ఇచ్చి విచారణ మొదలుపెట్టామని గుర్తు చేశారు. చంద్రబాబు తీరుతో రాజ్యాంగాన్ని నమ్ముకోవాలో… రాజకీయాలను నమ్ముకోవాలో అర్థంకాని పరిస్థితి తయారైందని ఆవేదన చెందారు నాదెండ్ల. మొత్తం మీద ఒక మాజీ స్పీకర్ అందులోనూ తన కన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తి చేత నీతులు చెప్పించుకోవాల్సి రావడంతో కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టమే. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నెపాన్ని మాత్రం కాంగ్రెస్‌పై నెడుతుంటారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Click on Image to Read: