కిలో ఉల్లిపాయలు...అర్ధ రూపాయే!
ఒక సమయంలో ఉల్లిపాయలు కొనేవారి కళ్లనుండి నీళ్లను తెప్పిస్తున్నాయంటూ వాటి పెరిగిన ధరల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే ఉల్లిపాయలు అమ్మేవారి ప్రాణాలనే నిలువునా తీస్తున్నాయి. మహారాష్ట్రలోని లాసూర్ హోల్‌సేల్ మార్కెట్ లో 450 కిలోల చిన్న ఉల్లిపాయలు అమ్మిన ఒక రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే 450 కిలోలు అమ్మితే అతనికి 175 రూపాయలు వచ్చాయి. ఇక్కడ కిలో అర్ధరూపాయికి ఉల్లిపాయలను అమ్ముతున్న రైతులకు ఇది ఒక ఆత్మహత్యలాగే అనిపిస్తోందని మరొక రైతు వాపోయాడు. […]
ఒక సమయంలో ఉల్లిపాయలు కొనేవారి కళ్లనుండి నీళ్లను తెప్పిస్తున్నాయంటూ వాటి పెరిగిన ధరల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే ఉల్లిపాయలు అమ్మేవారి ప్రాణాలనే నిలువునా తీస్తున్నాయి. మహారాష్ట్రలోని లాసూర్ హోల్‌సేల్ మార్కెట్ లో 450 కిలోల చిన్న ఉల్లిపాయలు అమ్మిన ఒక రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే 450 కిలోలు అమ్మితే అతనికి 175 రూపాయలు వచ్చాయి. ఇక్కడ కిలో అర్ధరూపాయికి ఉల్లిపాయలను అమ్ముతున్న రైతులకు ఇది ఒక ఆత్మహత్యలాగే అనిపిస్తోందని మరొక రైతు వాపోయాడు. మహారాష్ట్ర, మరట్వాడాలో లాసూర్ అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. ఇక్కడ వేలంలో ఉల్లిపాయలు కిలో యాభై పైసలు మాత్రమే పలుకుతున్నాయి. చాలా మంచి నాణ్యత ఉన్నవాటికి 100 కిలోలకు ఐదునుండి ఆరు వందల రూపాయలు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయ మార్కెట్ ఉన్న నాసిక్‌లో వంద కిలోలకు 720 రూ. ధర ఉంది.
ఎకరాకి 50 నుండి 80వేల రూ పాయలు ఖర్చుపెట్టి ఉల్లిపాయ పంటని వేసిన రైతులకు ఖర్చులుకూడా రాని పరిస్థితులు దాపురించాయి. పండించిన పంటని దాచుకునే సదుపాయం లేకపోవటం వలన కూడా రైతులు ఎంతోకొంత అన్నట్టుగా తెగనమ్ముతున్నారు. నీటి కరువు కారణంగా చెరుకుని పండించే రైతులు కూడా ఉల్లిపాయనే వేయటంతో డిమాండ్‌ని మించిన ఉత్పత్తి మార్కెట్లకు చేరింది. ప్రభుత్వం తమ పంటని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం 15వేల టన్నుల ఉల్లిపాయలను కొనేందుకు సిద్ధంగా ఉందని బిజెపి పార్టీ ప్రాంతీయ నేత ఒకరు తెలిపారు.