టైటిల్ పై వెనక్కి తగ్గిన పూరీ జగన్నాధ్...
ఇప్పటికే ఎన్టీఆర్ తో నేతాజీ, మహేష్ తో జనగణమన అనే టైటిల్స్ ను ఎనౌన్స్ చేశాడు పూరీ జగన్నాధ్. అయితే వీటిలో ఎన్టీఆర్ సినిమాపై వెనక్కి తగ్గాడు. తారక్ తో చేయబోయే సినిమాకు నేతాజీ అనే టైటిల్ ను పెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికైతే ఆ సినిమాకు కేవలం స్టోరీలైన్ మాత్రమే అనుకున్నామని…. స్క్రీన్ ప్లే పనులు ఇంకా ప్రారంభించలేదని స్పష్టంచేశాడు. ప్రస్తుతం పూరి… రోగ్ అనే కన్నడ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ […]
Advertisement
ఇప్పటికే ఎన్టీఆర్ తో నేతాజీ, మహేష్ తో జనగణమన అనే టైటిల్స్ ను ఎనౌన్స్ చేశాడు పూరీ జగన్నాధ్. అయితే వీటిలో ఎన్టీఆర్ సినిమాపై వెనక్కి తగ్గాడు. తారక్ తో చేయబోయే సినిమాకు నేతాజీ అనే టైటిల్ ను పెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికైతే ఆ సినిమాకు కేవలం స్టోరీలైన్ మాత్రమే అనుకున్నామని…. స్క్రీన్ ప్లే పనులు ఇంకా ప్రారంభించలేదని స్పష్టంచేశాడు. ప్రస్తుతం పూరి… రోగ్ అనే కన్నడ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ తర్వాత కల్యాణ్ రామ్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ సినిమా పని మొదలుపెడతాడు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజీ పూర్తిచేసి, వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమాను కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. సో… వీళ్లిద్దరి ప్రాజెక్టుపై అప్పుడే ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదు. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. అందుకే పూరి-తారక్ నెక్ట్స్ మూవీపై టైటిల్ నుంచే అంచనాలు పెరిగాయి. ఈ కాంబోపై మరిన్ని అప్ డేట్స్ కావాలంటే కనీసం 3 నెలలైనా ఆగాల్సి ఉంటుంది.
Advertisement