రూ.2 కోట్లలో రూపాయి కూడా వద్దు- మద్దిలేటి రెడ్డి
కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను పెళ్లి చేసుకునేందుకు ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటి రెడ్డి సిద్ధమంటున్నారు. తనకు ప్రత్యూష మాత్రమే చాలంటున్నాడు. ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తులు గానీ, డబ్బు గానీ ఒక్క రూపాయి కూడా తనకు అవసరం లేదంటున్నాడు. ప్రత్యూషకు ఉన్నరూ. రెండు కోట్ల ఆస్థి అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటానని మద్దిలేటి చెబుతున్నాడు. బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును మద్దులేటి రెడ్డి కలిసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని […]
కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను పెళ్లి చేసుకునేందుకు ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటి రెడ్డి సిద్ధమంటున్నారు. తనకు ప్రత్యూష మాత్రమే చాలంటున్నాడు. ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తులు గానీ, డబ్బు గానీ ఒక్క రూపాయి కూడా తనకు అవసరం లేదంటున్నాడు. ప్రత్యూషకు ఉన్నరూ. రెండు కోట్ల ఆస్థి అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటానని మద్దిలేటి చెబుతున్నాడు.
బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును మద్దులేటి రెడ్డి కలిసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో అచ్యుతరావుతో కలసి మద్దులేటి రెడ్డి విలేకరులతో తన ప్రేమ గురించి వివరించారు. ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పాడు. ఆ సమయంలోనే తమ మధ్య పరిచయం ఏర్పడిందన్నారు.
రిజిష్టర్ బుక్‌లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష నాకు ఫోన్ చేసిందని చెప్పాడు. “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. నాక్కూడా తనపై ఇష్టం ఉన్నందున వెంటనే ఒప్పుకున్నాను’’ అని చెప్పాడు. ప్రత్యూష చెప్పిన మాటలను రికార్డు చేసుకుని పెట్టుకున్నానని వివరించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుని ప్రత్యూషతో తన పెళ్లి జరిపించాలని కోరాడు.
ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారని, ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మానవతా దృక్పథాన్ని చాటుకోవాలని అచ్యుతరావు కోరారు. కేసీఆర్ మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరఫున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారన్నారు.
Click on Image to Read: