ఈ నెల 20 నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం...!

తిరుపతి వెంక‌న్న కు జ‌రిగే బ్ర‌హ్మోత్సవాలు చూడ‌టానికి దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌స్తుంటారు. చూసి త‌రిస్తుంటారు. ఇందులో ఉత్స‌వం అనే ప‌దం తీసుకుంటే..ఆనందం అనే కోణంలో చూడాలి. ప్ర‌తి కుటుంబం జీవితంలో ఆనంద క్ష‌ణాలు .. సంఘ‌ట‌న‌లు ఉంటాయి. అయితే గ్లోబ‌లైజేష‌న్ రాక తో కుటుంబం.. మాన‌వ సంబంధాలు కొత్త కుదుపుకు లోను అయ్యాయి. ఉమ్మ‌డి కుటుంబాల నంచి వ్య‌క్తి కుటుంబాలు వ‌చ్చాయి. మ‌న కుటుంబ నుంచి.. నా కుటుంబం అనే న్యారోలైన్ ఎంట‌ర్ అయ్యింది. […]

Advertisement
Update:2016-05-08 08:06 IST

తిరుపతి వెంక‌న్న కు జ‌రిగే బ్ర‌హ్మోత్సవాలు చూడ‌టానికి దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌స్తుంటారు. చూసి త‌రిస్తుంటారు. ఇందులో ఉత్స‌వం అనే ప‌దం తీసుకుంటే..ఆనందం అనే కోణంలో చూడాలి. ప్ర‌తి కుటుంబం జీవితంలో ఆనంద క్ష‌ణాలు .. సంఘ‌ట‌న‌లు ఉంటాయి. అయితే గ్లోబ‌లైజేష‌న్ రాక తో కుటుంబం.. మాన‌వ సంబంధాలు కొత్త కుదుపుకు లోను అయ్యాయి. ఉమ్మ‌డి కుటుంబాల నంచి వ్య‌క్తి కుటుంబాలు వ‌చ్చాయి. మ‌న కుటుంబ నుంచి.. నా కుటుంబం అనే న్యారోలైన్ ఎంట‌ర్ అయ్యింది. దీనికి తోడు మార్కెట్ ప్ర‌పంచం చూపించే అంద‌మైన జీవితం అందుకోవ‌డానికి ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్లు వాళ్లు పోరాటం .. ఈ పోరాటంలో సాముహిక సంతోషాలు ఆవిరైపోయాయి. వ్య‌క్తుల మ‌ధ్య .. వ‌ర్గాల మ‌ధ్య విశాల త‌త్వం అనే ఆలోచ‌న కుదించుకు పోయింది. నా కులం, నా కుటుంబ‌, నా వ‌ర్గం అనే ధోర‌ణి .. ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవాలే త‌ప‌న‌.. అందుకోసం ఎంత‌టికైనా..దేనికైనా తెగించే స్వ‌భావం పెరిగింది.

మ‌రి శ్రీ‌కాంత్ అడ్డాల బ్ర‌హ్మోత్స‌వంలో ఏంచూపించ‌బోతున్నాడు. సంకుచిత స్వ‌భావాల్ని వీడి.. సంతోషంగా , నిష్క‌ల్మ‌షంగా ఉంటే.. ప్ర‌తి రోజు స‌మాజంలో ఎన్నో బ్ర‌హ్మోత్స‌వాలు పుడ‌తాయి. అటువంటి ఒక ప్ర‌య‌త్నమే మ‌హేష్ బాబు , కాజ‌ల్, స‌మంత , ప్ర‌ణీత ల కాంబినేష‌నో్ లో చేసిన బ్ర‌హ్మోత్స‌వం. పివిపి నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కిన ఈచిత్రం ఈ నెల 20 ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక అప్ప‌టి నుంచి సినిమా ప్రేమికుల‌కు.. ముఖ్యంగా మ‌హేష్ బాబు ఫ్యాన్స్ కు రియ‌ల్ బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం అయిన‌ట్లేన్నారు అన్నారు హీరో మ‌హేష్. ఈ చిత్రం ఆడియో విడుద‌ల శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News