ఆగ్రహించిన ఉపాసన.. ఫేస్ బుక్ లో కామెంట్స్
ఇటీవల హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు కారు ఢీకొని చనిపోయిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దేవి ఉదంతంపై రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన తీవ్రంగా స్పందించారు. కేసు దర్యాప్తు తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ధనవంతులు ఏమీ చేసినా వదిలేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో స్పందించిన ఉపాసన…మరో భారతీయ బిడ్డ జీవితాన్ని కోల్పోయిందని ఆవేదన చెందారు. ఇంత జరిగినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, అందుకు నిందితుడు ధనవంతుడు, పలుకుబడి […]
ఇటీవల హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు కారు ఢీకొని చనిపోయిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దేవి ఉదంతంపై రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన తీవ్రంగా స్పందించారు. కేసు దర్యాప్తు తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ధనవంతులు ఏమీ చేసినా వదిలేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో స్పందించిన ఉపాసన…మరో భారతీయ బిడ్డ జీవితాన్ని కోల్పోయిందని ఆవేదన చెందారు. ఇంత జరిగినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, అందుకు నిందితుడు ధనవంతుడు, పలుకుబడి ఉన్న వాడు కావడమేనని విమర్శించారు. నిందితులకు శిక్ష పడేలా అందరం కలిసి పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. పోలీసులు చర్యలు తీసుకునే వరకూ ఈ పోస్టును షేర్ చేద్దామంటూ ఫేస్ బుక్ లో ఉపాసన పోస్టు పెట్టారు . ఆమె పోస్టుకు మంచి స్పందనే వస్తోంది.
జూబ్లిహిల్స్ లో దేవి కారు చెట్టుకు ఢీకొంది. ఆమె చనిపోగా కారు నడుపుతున్న భరత్ కు ఏమీ కాలేదు. ప్రమాదం జరిగిన తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ముమ్మాటికి హత్యేనని దేవి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో పోలీసులు కేసు దర్యాప్తును సీఐ నుంచి ఏసీపీకి మార్చారు. నిందితులుగా భావిస్తున్న వారు పలుకుబడి ఉన్న వారు కావడంతో కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని దేవి తండ్రి ఆరోపిస్తూ వస్తున్నారు.
click to read-