నేను లేకపోతే పులివెందుల బత్తాయి ఎండిపోయేది... 10 సీట్లు మావే అనిపిస్తోంది

రాష్ట్రంలో తన పాలనకు చంద్రబాబు మరోసారి కితాబిచ్చుకున్నారు. కడపలో జరిగిన రైతు రుణ ఉపశమన మేళాలో పాల్గొన్న చంద్రబాబు… గతంలో పోలీస్ స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేవారన్నారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.  అగ్రికల్చర్ అధికారులు ఎవరైనా పొలాలకు రాకుంటే చెప్పాలని వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తానని హెచ్చరించారు . రతనాల సీమ అయిన రాయలసీమను రాళ్లసీమగా గత ప్రభుత్వం మార్చేసిందన్నారు. తిరిగి రాయలసీమను రతనాల సీమను చేసే బాధ్యత తాను […]

Advertisement
Update:2016-05-07 09:42 IST

రాష్ట్రంలో తన పాలనకు చంద్రబాబు మరోసారి కితాబిచ్చుకున్నారు. కడపలో జరిగిన రైతు రుణ ఉపశమన మేళాలో పాల్గొన్న చంద్రబాబు… గతంలో పోలీస్ స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేవారన్నారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అగ్రికల్చర్ అధికారులు ఎవరైనా పొలాలకు రాకుంటే చెప్పాలని వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తానని హెచ్చరించారు . రతనాల సీమ అయిన రాయలసీమను రాళ్లసీమగా గత ప్రభుత్వం మార్చేసిందన్నారు. తిరిగి రాయలసీమను రతనాల సీమను చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

పులివెందుల్లో బత్తాయి, అరటి పంటలు ఎండిపోతుంటే తానే రెండు టీఎంసీల నీరు ఇచ్చానని చెప్పారు. నీరు లేకపోయినా రెండు టీఎంసీల నీరు ఇచ్చానని ఒకవేళ తాను అలా ఇచ్చి ఉండకపోతే పులివెందుల్లో పంటలన్నీ ఎండిపోయేవని చెప్పారు. తాను నీరు ఇవ్వడం వల్లే బత్తాయి టన్ను రూ. 50వేలకు అమ్ముకోగలిగారన్నారు. పులివెందులకు నీరిచ్చేందుకు పట్టిసీమ కడుతుంటే అడ్డుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కడప జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే గెలిచామని… వచ్చే ఎన్నికల్లో మొత్తం 10 సీట్లు గెలుస్తామన్న నమ్మకం కలుగుతోందన్నారు. అభివృధ్ధి కోసం ఆదినారాయణ రెడ్డి, జయరాములు టీడీపీలోకి వచ్చారని చంద్రబాబు ప్రశంసించారు.

కొందరు నేతలు కుట్రచేసి తుని వెళ్లి రైలు తగలబెట్టారని కడపలోనే చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారని… అలాంటి వారంతా టీడీపీ హయాంలోనే రాయలసీమకు న్యాయం జరిగిందని గుర్తించాలని బాబు హితవు పలికారు. తాను కూడా రాయలసీమలో పుట్టిన వాడినేనని సభలో చంద్రబాబు చెప్పుకున్నారు. రైతులకు 24 వేల కోట్లు, మహిళలకు 10 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమదేనని అన్నారు. అయితే మహిళకు పదివేల కోట్లు ఇచ్చామన్నదాంట్లో నిజం ఉన్నట్టుగా అనిపించడం లేదు.

click to read-

Tags:    
Advertisement

Similar News