బాబు దెబ్బకు సీఎస్ హడల్.. సెలవుపై వెళ్లే యోచన

పరిపాలనలో చంద్రబాబు వ్యవహరిస్తున్న పోకడలను సీనియర్ అధికారులు భరించలేకపోతున్నారు. సీనియారిటీ, రూల్స్ అన్ని పక్కన పెట్టి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల దెబ్బకు అధికారులు తామెక్కడ భవిష్యత్తులో ఇరుక్కుంటామోనని ఆందోళన చెందుతున్నారు. చోటామోట అధికారులు కాదు.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కరే.. చంద్రబాబు తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏకంగా సీఎస్‌ ఇలాంటి అరుదైన ఆలోచన చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. పేరుకు […]

Advertisement
Update:2016-05-06 08:50 IST

పరిపాలనలో చంద్రబాబు వ్యవహరిస్తున్న పోకడలను సీనియర్ అధికారులు భరించలేకపోతున్నారు. సీనియారిటీ, రూల్స్ అన్ని పక్కన పెట్టి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల దెబ్బకు అధికారులు తామెక్కడ భవిష్యత్తులో ఇరుక్కుంటామోనని ఆందోళన చెందుతున్నారు. చోటామోట అధికారులు కాదు.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కరే.. చంద్రబాబు తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.

ఏకంగా సీఎస్‌ ఇలాంటి అరుదైన ఆలోచన చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. పేరుకు సీఎస్‌ టక్కర్ అయినా నిర్ణయాలన్నీ ఆయనకు తెలియకుండానే జరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. సీఎంఓలోని వారే అంతా చక్రం తిప్పుతున్నారట. అధికారుల బదిలీల విషయంలో టక్కర్ అభిప్రాయాలకు ఒకశాతం విలువ కూడా చంద్రబాబు ఇవ్వవడం లేదని చెబుతున్నారు. తన కేరీర్‌లో చాలా మంది అధికారులను దగ్గర నుంచి గమనించిన టక్కర్.. ఆ అనుభవంతో సమర్ధులైన అధికారుల పేర్లను పలు పోస్టులకు సూచించగా చంద్రబాబు తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది.

అధికారుల బదిలీల్లో సీఎస్‌ను కేవలం రబ్బర్ స్టాంప్‌గా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. బదిలీలే కాకుండా కాంట్రాక్టులు, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని.. వాటికి ఆమోద ముద్ర వేస్తే భవిష్యత్తులో తమకు ఇక్కట్లు తప్పవని సీఎస్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. దాదాపు ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. ఈ ఫైల్‌పై సంతకం చేసేందుకు అప్పట్లో సీఎస్‌ కూడా అంగీకరించలేదు. ఆయన తర్వాత వచ్చిన టక్కర్ కూడా ఇరిగేషన్ ఫైల్ మూవ్ చేసేందుకు అంగీకరించలేదు. అయితే చంద్రబాబు పదేపదే ఒత్తిడి తేవడంలో ఆ ఫైల్ ముందుకు కదిలింది. ఇలా పలు అంశాల్లో చంద్రబాబు నిర్ణయాలకు అధికారులు భయపడిపోతున్నారు. ఒకవేళ సీఎస్ టక్కర్ నిజంగానే లీవ్ పై వెళ్తే పరిపాలనకు అదో మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అధికారుల్లో అలజడి మరింత పెరగవచ్చు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News