కంటతడి పెట్టించిన చంద్రబాబు సెంటిమెంట్
చంద్రబాబు పడుతున్న కష్టాల గురించి ఈ మధ్య ఏ ఇద్దరు టీడీపీ నేతలు కలిసినా చర్చ పెట్టేస్తున్నారు. ”రోజుకు 18 గంటలు ఎండలో కష్టపడుతున్నా, మనవడిని కూడా చూడలేకపోతున్నా” అని పదేపదే చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆయనకు తోడు కుమారుడు లోకేష్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారు. ”ఏ తాతకైనా మనవడితో ఆడుకోవాలని ఉండదా.. కానీ మా నాన్నకు ఆ అవకాశం లేకుండా పోయింది” అంటూ సీన్ రక్తికట్టిస్తున్నారు. 67 ఏళ్ల వయసులో 17 ఏళ్ల కుర్రాడిలా […]
చంద్రబాబు పడుతున్న కష్టాల గురించి ఈ మధ్య ఏ ఇద్దరు టీడీపీ నేతలు కలిసినా చర్చ పెట్టేస్తున్నారు. ”రోజుకు 18 గంటలు ఎండలో కష్టపడుతున్నా, మనవడిని కూడా చూడలేకపోతున్నా” అని పదేపదే చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆయనకు తోడు కుమారుడు లోకేష్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తున్నారు. ”ఏ తాతకైనా మనవడితో ఆడుకోవాలని ఉండదా.. కానీ మా నాన్నకు ఆ అవకాశం లేకుండా పోయింది” అంటూ సీన్ రక్తికట్టిస్తున్నారు.
67 ఏళ్ల వయసులో 17 ఏళ్ల కుర్రాడిలా కష్టపడుతున్నారంటూ పొగిడే పని కూడా మరొకరికి లేకుండా చేస్తున్నారు లోకేష్. అయితే తండ్రి కొడుకులు చెబుతున్న మాటలు టీడీపీ నేతలకే నవ్వు తెప్పిస్తున్నాయి. బాబు, చినబాబుల సమక్షంలోనే ”అవును కదా నిజమే” అన్నట్టుగా సీరియస్ ఫేసులు పెడుతున్న టీడీపీ నేతలు బయటకు వచ్చాక మాత్రం గొల్లున నవ్వుకుంటున్నారు. జనాన్ని పిచ్చొళ్లను చేయడంతో తండ్రికొడుకులకు తిరుగులేదని సెటైర్లు వేస్తున్నారు. ఒకసారి చంద్రబాబు ఆవేదనలో వాస్తవం ఎంతుందో గమనిస్తే…
చంద్రబాబు తాను 18 గంటలు ఎండలో కష్టపడుతున్నానని కార్మిక దినోత్సవం రోజు సెలవిచ్చారు. ఈ ప్రకటన వింటేనే నవ్వు రాక మానదు. ఎందుకంటే మన దేశంలో ఎక్కడా కూడా రోజూకు 18 గంటల పాటు ఎండ ఉండదు. రష్యాలాంటి దేశాల్లో మాత్రమే అది సాధ్యం. కాబట్టి తాను రష్యాలో నివసిస్తున్నట్టుగా చంద్రబాబు భ్రమపడుతున్నారేమో!. ఇక ఎక్కడికి వెళ్లినా మనవడితో ఆడుకోలేకపోతున్నా అని ఫీల్ అయిపోతున్నారు. ఆడుకోవద్దని ఎవరన్నారు?. దేశంలోనే అనేక మంది ముఖ్యమంత్రులు, నేతలకు కూడా మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వారు కూడా ఇలాగే చెప్పుకుంటున్నారా?.
కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తుండడం వల్ల సమయం సరిపోవడం లేదని చెబుతున్నారు. కానీ అందులోనూ వాస్తవం కనిపించదు. ఎందుకంటే చంద్రబాబు కేవలం రాష్ట్రంలో పరిపాలన మీద మాత్రమే ధ్యాస పెడితే మనవడితో ఆడుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. కానీ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారాలను దగ్గరుండి ఆయనే పర్యవేక్షిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అభిప్రాయాలతో సంబంధం లేకుండా భూమా, ఆదినారాయణరెడ్డి లాంటి వారిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారంలో నాలుగైదు సార్లు సెటిల్మెంట్ పంచాయతీలు.
గ్రూపు తగాదాలు సృష్టించేలా పక్కపార్టీ ఎమ్మెల్యేలను తీసుకురావడం ఎందుకు?. వారితో గంటల తరబడి పంచాయతీలు పెట్టడం ఎందుకు?. అయినా 67 ఏళ్ల వయసులో మా నాన్న కష్టపడుతున్నారని లోకేష్ వాపోతుంటారు. కానీ 80 ఏళ్ల వయసులోనూ మన్మోహన్ సింగ్ ఏకంగా పదేళ్ల పాటు దేశాన్నే ఏలారు. అయినా అంత వయసు మీద పడి ఉంటే సీఎం పదవి మరొకరికి అప్పగించి ఎంచ్చక్కా మనవడితో ఆడుకోవచ్చు కదా!. ఎందుకు బాబు కరువుతో జనం అల్లాడుతుంటే ఈ సెటిమెంట్ సరాగాలు?.
Click on Image to Read: