ఎంపీ జంప్... సేమ్ డైలాగ్ చెప్పిన పొంగులేటి

తెలంగాణ‌లో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫిరాయింపుదారుల జాబితాలో చేరిపోయారు. వైసీపీని వీడుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఖ‌మ్మంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేసిన ఆయ‌న … తెలంగాణ‌లో వైసీపీ వెంట ప్ర‌జ‌లు న‌డిచే ప‌రిస్థితి లేద‌న్నారు. వైసీపీని బ‌తికించుకునేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు.  వైసీపీ మీద ఆంధ్రా పార్టీ అన్న ముద్ర‌ప‌డింద‌ని అభిప్రాయ‌య‌ప‌డ్డారు. జగన్ మాత్రం తనను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని అయితే అనుబంధాలు, ప్రాంతా అభివృద్ధి వేరు వేరు అన్నారు. తెలంగాణలో […]

Advertisement
Update:2016-05-02 09:55 IST

తెలంగాణ‌లో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫిరాయింపుదారుల జాబితాలో చేరిపోయారు. వైసీపీని వీడుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఖ‌మ్మంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేసిన ఆయ‌న … తెలంగాణ‌లో వైసీపీ వెంట ప్ర‌జ‌లు న‌డిచే ప‌రిస్థితి లేద‌న్నారు. వైసీపీని బ‌తికించుకునేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు. వైసీపీ మీద ఆంధ్రా పార్టీ అన్న ముద్ర‌ప‌డింద‌ని అభిప్రాయ‌య‌ప‌డ్డారు. జగన్ మాత్రం తనను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని అయితే అనుబంధాలు, ప్రాంతా అభివృద్ధి వేరు వేరు అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కొన్ని ప్రాజెక్టులను పూర్తిచేశారని మిగిలిన ప్రాజెక్టులకు కేసీఆర్ పూర్తిచేస్తారని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో అభివృధ్ధి కోస‌మే టీఆర్ ఎస్‌లో చేరుతున్న‌ట్టుగా పొంగులేటి చెప్పారు. ఈ నెల 4న కేసీఆర్ సమక్షంలో పొంగులేటి టీఆర్ఎస్ లో చేరనున్నారు. త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారు రావ‌చ్చున‌ని పిలుపునిచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ వైసీపీ అధ్య‌క్షుడిగానూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సేవ్ డెమొక్రసీ పేరుతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన జగన్ బృందంలో పొంగులేటి ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News