ప్రియుడితో పెళ్లి కోసం పట్టుబడుతున్న కేసీఆర్ దత్త పుత్రిక
ప్రత్యూష. కొన్ని నెలల క్రితం ఈ పేరు మీడియాలో మార్మోగింది. సవతి తల్లి,తండ్రి చేతుల్లో నెలల తరబడి చిత్రహింసలకు గురైంది ఈమె. చివరకు స్వచ్చంద సంస్థల సాయంతో నరకం నుంచి బయటపడింది. ఆమె బయటి ప్రపంచంలోకి వచ్చే సరికి శరీరం మొత్తం గాయాలు, ముఖం మీద వాతలతో కనిపించి అందరినీ కదిలించివేసింది. ఈ దారుణాన్ని హైకోర్టు అప్పట్లో సుమోటోగా తీసుకుంది. చిన్నారికి జరిగిన అన్యాయం చూసి చలించిపోయిన కేసీఆర్… ప్రత్యూషను దత్తత తీసుకున్నారు. ప్రతి పండుగకు ఆమె […]
ప్రత్యూష. కొన్ని నెలల క్రితం ఈ పేరు మీడియాలో మార్మోగింది. సవతి తల్లి,తండ్రి చేతుల్లో నెలల తరబడి చిత్రహింసలకు గురైంది ఈమె. చివరకు స్వచ్చంద సంస్థల సాయంతో నరకం నుంచి బయటపడింది. ఆమె బయటి ప్రపంచంలోకి వచ్చే సరికి శరీరం మొత్తం గాయాలు, ముఖం మీద వాతలతో కనిపించి అందరినీ కదిలించివేసింది. ఈ దారుణాన్ని హైకోర్టు అప్పట్లో సుమోటోగా తీసుకుంది. చిన్నారికి జరిగిన అన్యాయం చూసి చలించిపోయిన కేసీఆర్… ప్రత్యూషను దత్తత తీసుకున్నారు. ప్రతి పండుగకు ఆమె కేసీఆర్ ఇంటికి వస్తూ ఉంటుంది. చదువుతో పాటు పెద్దయ్యాక పెళ్లి కూడా తానే చేస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యూష వయసు 19 ఏళ్లు. మహిళా శిశు సంక్షేమ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ప్రత్యూష చదువుకుంటోంది.
ప్రత్యూష ప్రేమించిన అబ్బాయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వాడిగా గుర్తించారు. ఆటో మొబైల్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడు తరచూ ప్రత్యూషను కలుస్తుంటారని అధికారులు చెబుతున్నారు. చూడాలి దత్త కూతురి విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఏదీ ఏమైనా ప్రత్యూషకు మంచి జీవితమే అందించాలని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు .
Click on Image to Read: