జగన్ డైనమిక్.. వైఎస్ థియేటర్లు నేను ప్రారంభించా...బాబు వల్లే కాపు ఉద్యమం
తన పుట్టిన రోజు సందర్భంగా సినీ దర్శకుడు, మాజీ కేంద్రమంత్రి దాసరినారాయణరావు కొన్ని చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గురించి మాట్లాడారు. జగన్ డైనమిక్ లీడర్ అని అతడు అనుకున్నది సాధిస్తాడని చెప్పారు. మొదటి నుంచి కూడా మాట మీద నిలబడే తత్వం అతడిది అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. వైఎస్ సీఎం కాకముందు నుంచే తనతో మంచి సంబంధాలున్నాయన్నారు. విజయవాడలో వైఎస్‌కు చెందిన […]
తన పుట్టిన రోజు సందర్భంగా సినీ దర్శకుడు, మాజీ కేంద్రమంత్రి దాసరినారాయణరావు కొన్ని చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గురించి మాట్లాడారు. జగన్ డైనమిక్ లీడర్ అని అతడు అనుకున్నది సాధిస్తాడని చెప్పారు. మొదటి నుంచి కూడా మాట మీద నిలబడే తత్వం అతడిది అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. వైఎస్ సీఎం కాకముందు నుంచే తనతో మంచి సంబంధాలున్నాయన్నారు. విజయవాడలో వైఎస్‌కు చెందిన రాజ్ యువరాజ్ థియేటర్లు తన చేతుల మీదుగానే ప్రారంభం అయ్యాయని దాసరి గుర్తు చేసుకున్నారు. జగన్ ఇటీవల తనను కేవలం ఆశీస్సుల కోసమే కలిశారని చెప్పారు. జగన్ తనను కలిసిన తర్వాతే కాపు ఉద్యమం తీవ్రమైందన్నది అవాస్తవం అన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం వల్లే కాపు ఉద్యమం వచ్చిందన్నారు. కాపు ఉద్యమానికి తన మద్దతు ఉంటుందన్నారు.
సినీపరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోదని అన్నారు. సినీ పరిశ్రమ కోసం కేసీఆర్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. త్వరలోనే పవన్ కల్యాణ్‌తో సినిమా నిర్మిస్తున్నట్టు దాసరి చెప్పారు. అయితే ఈ సినిమా రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు. పవన్ డైరెక్టర్ కావాల్సిన వాడని కానీ నటుడిగా అయ్యారని దాసరి అన్నారు . ప్రస్తుతం బయటకు చెబుతున్నంత మొత్తాన్ని ఏ సినిమా కూడా వసూలు చేయడం లేదన్నారు. చిరుతో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. పైగా చిరు తనకు బంధువు అవుతారన్నారు దాసరి. సామాన్యుడైనా కష్టపడితే పైకి ఎదగవచ్చన్న దానికి తానే ఒక నిదర్శనం అని దాసరి చెప్పారు.
Click on Image to Read: