టీడీపీలో చేరే ఆలోచన విరమించుకున్న కొణతాల
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. మేధావులతో కలిసి ఉత్తరాంధ్ర పోరాట ఐక్యవేదికను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలపై పోరాటం చేయనున్నారు. రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజ్, థర్మల్ పవర్ ప్లాంట్, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల.. ఆ తర్వాత టీడీపీలో చేరేందుకు […]
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. మేధావులతో కలిసి ఉత్తరాంధ్ర పోరాట ఐక్యవేదికను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలపై పోరాటం చేయనున్నారు. రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజ్, థర్మల్ పవర్ ప్లాంట్, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల.. ఆ తర్వాత టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ గంటా వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీడీపీలో చేరడం ఆలస్యమవుతూ వచ్చింది. గురువారం కొణతాల అనుచరులైన వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు టీడీపీలో చేరారు. కొణతాల మాత్రం మరో దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Click on Image to Read: