బార్‌కెళ్లొచ్చు...బీర్ కొట్టొచ్చు...పొట్టి బ‌ట్ట‌లే నిషిద్ధం!

స‌మాజంలో అభిప్రాయాలే కాదు, చివ‌రికి ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు కూడా స‌ర్వ‌పాపాల‌కు స్త్రీయే మూలం అన్న‌ట్టుగా ఉంటున్నాయి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు మ‌ద్య‌పానం, ఆల్క‌హాల్‌ ఒక ముఖ్య‌మైన కార‌ణమ‌ని తేలినా, దానిపై ఎక్క‌డా ఎలాంటి నియంత్ర‌ణ క‌న‌బ‌డ‌దు. ప‌బ్‌లు, డిస్కోథెక్‌లు కూడా య‌థేచ్ఛ‌గా అర్థ‌రాత్రివ‌ర‌కు న‌డుస్తుంటాయి.  కానీ మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌మీద మాత్రం చ‌ట్టాలు, విధానాలు తెచ్చేస్తుంటారు. తాజాగా ఛండీగ‌ఢ్ జిల్లా యంత్రాంగం అలాంటి ఒక పాల‌సీని ప్ర‌వేశ పెట్టింది.  ప‌బ్లిక్‌ వినోద స్థ‌లాల్లో నియంత్ర‌ణ 2016….. అనే […]

Advertisement
Update:2016-04-20 05:36 IST

స‌మాజంలో అభిప్రాయాలే కాదు, చివ‌రికి ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు కూడా స‌ర్వ‌పాపాల‌కు స్త్రీయే మూలం అన్న‌ట్టుగా ఉంటున్నాయి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు మ‌ద్య‌పానం, ఆల్క‌హాల్‌ ఒక ముఖ్య‌మైన కార‌ణమ‌ని తేలినా, దానిపై ఎక్క‌డా ఎలాంటి నియంత్ర‌ణ క‌న‌బ‌డ‌దు. ప‌బ్‌లు, డిస్కోథెక్‌లు కూడా య‌థేచ్ఛ‌గా అర్థ‌రాత్రివ‌ర‌కు న‌డుస్తుంటాయి. కానీ మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌మీద మాత్రం చ‌ట్టాలు, విధానాలు తెచ్చేస్తుంటారు. తాజాగా ఛండీగ‌ఢ్ జిల్లా యంత్రాంగం అలాంటి ఒక పాల‌సీని ప్ర‌వేశ పెట్టింది. ప‌బ్లిక్‌ వినోద స్థ‌లాల్లో నియంత్ర‌ణ 2016….. అనే ఈ పాల‌సీ ప్ర‌కారం ప‌బ్‌లు, డిస్కోతెక్‌లకు వెళ్లే అమ్మాయిలు పొట్టి స్క‌ర్టులు ధ‌రించి వెళ్ల‌కూడ‌ద‌నే నిబంధ‌న విధించారు. అమ్మాయిలు అస‌భ్యంగా, రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో ఉన్న దుస్తుల‌ను ధ‌రించి డిస్కోథెక్‌ల‌కు, ప‌బ్‌ల‌కు వెళ్ల‌కూడ‌దనే నిబంధ‌న‌తో పాటు, బార్‌లు తెర‌చిఉంచే టైమ్‌ని తెల్ల‌వారు జామున రెండు నుండి అర్థ‌రాత్రి ప‌న్నెండుకి త‌గ్గించారు.

బార్‌లు డిస్కోథెక్‌ల్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇచ్చేందుకు ప్ర‌త్యేకంగా ఒక నోడ‌ల్ క‌మిటీని ఏర్పాటు చేశారు. ప‌బ్‌లు, డిస్కో థెక్‌ల్లో తాము విధించిన నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే వాటి అనుమ‌తుల‌ను ర‌ద్దుచేసే అధికారం ఈ క‌మిటీకి ఉంటుంది. కొత్త‌గా రూపొందించిన విధానంలో అర‌కొర దుస్తులు ధ‌రించిన మ‌హిళ‌లను ప‌బ్లిసిటీకి వాడ‌టం, అశ్లీల‌త‌, రెచ్చ‌గొట్టే ధోర‌ణి..లాంటి మాట‌ల‌ను వాడారు…కానీ వీటికి స‌రైన అర్థం ఏమిటో, వారు ఏం నియంత్రించాల‌నుకుంటున్నారో తెలియ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు విన‌బ‌డుతున్నాయి. ఈ పాల‌సీల‌పై బార్లు, రెస్టారెంట్ల ఓన‌ర్లు తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News