కోహినూర్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాం...వెన‌క్కి తేలేము!

మ‌న‌దేశం నుండి త‌ర‌లిపోయిన సంప‌ద‌లో ముందుగా చెప్పుకునే పేరు కోహినూర్ వ‌జ్రం. కోహినూర్‌ని తిరిగి తీసుకురావాల‌ని కోరుతూ దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని ఇటీవ‌ల విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు, ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వ స‌మాధానాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం కోహినూర్‌ని బ్రిటీష్‌వారు దొంగిలించ‌లేదు, బ‌ల‌వంతంగా తీసువెళ్ల‌లేదు, అది వారికి బ‌హుమ‌తిగా వెళ్లింది…క‌నుక వెన‌క్కి ఇవ్వ‌మ‌ని అడ‌గలేమ‌ని  సుప్రీంకోర్టుకి తెలిపింది.  పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్‌సింగ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీకి కోహినూర్‌ని కానుకగా ఇచ్చారని, అందుకే వెనక్కి […]

Advertisement
Update:2016-04-18 10:49 IST

మ‌న‌దేశం నుండి త‌ర‌లిపోయిన సంప‌ద‌లో ముందుగా చెప్పుకునే పేరు కోహినూర్ వ‌జ్రం. కోహినూర్‌ని తిరిగి తీసుకురావాల‌ని కోరుతూ దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని ఇటీవ‌ల విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు, ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వ స‌మాధానాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం కోహినూర్‌ని బ్రిటీష్‌వారు దొంగిలించ‌లేదు, బ‌ల‌వంతంగా తీసువెళ్ల‌లేదు, అది వారికి బ‌హుమ‌తిగా వెళ్లింది…క‌నుక వెన‌క్కి ఇవ్వ‌మ‌ని అడ‌గలేమ‌ని సుప్రీంకోర్టుకి తెలిపింది. పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్‌సింగ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీకి కోహినూర్‌ని కానుకగా ఇచ్చారని, అందుకే వెనక్కి ఇవ్వమని అడిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. 105 క్యారెట్ల కోహినూర్ వ‌జ్రం ప్ర‌స్తుతం రాణి కిరీటంలో ఉంది.

ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ నిర్వాహకులు కోహినూర్‌తో పాటు బ్రిట‌న్‌లో ఉన్న ప‌లు విలువైన వ‌స్తువుల‌ను వెన‌క్కి తెప్పించాలంటూ సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ రోజు విచార‌ణ‌లో కేంద్రం, కోహినూర్ విష‌యంలో త‌న వైఖ‌రిని తెలియ‌జేయ‌గా, మ‌రో ఆరువారాల్లో ఈ అంశంపై పూర్తిస్థాయి స్పంద‌న‌ను తెలియ‌జేయాల‌ని కోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కోహినూర్ వ‌జ్రాన్ని తిరిగి ఇవ్వ‌బోమ‌ని బ్రిట‌న్ గ‌తంలో ఒక‌సారి ప్ర‌క‌టించింది.

Tags:    
Advertisement

Similar News