కొత్త కరివేపాకు వేట " పవన్‌కు టీడీపీ మీడియా పరోక్ష హెచ్చరిక
2014 ఎన్నికల్లో పవన్ మద్దతు వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నది ఎవరూ కాదనలేని నిజం. పవన్ పిలుపుతో కాపులంతా మూకుమ్మడిగా టీడీపీకి ఓటేశారు. అయినప్పటికీ కేవలం ఐదు లక్షల స్వల్ప తేడాతో చంద్రబాబు సీఎం పీఠం అధిరోహించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్‌ను పక్కనపడేసినట్టు కనిపించింది. రాజధాని భూసేకరణ సమయంలోనూ పవన్ మాటను పెడచెవిన పెట్టారు. పరిస్థితి చూస్తుంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల […]
2014 ఎన్నికల్లో పవన్ మద్దతు వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నది ఎవరూ కాదనలేని నిజం. పవన్ పిలుపుతో కాపులంతా మూకుమ్మడిగా టీడీపీకి ఓటేశారు. అయినప్పటికీ కేవలం ఐదు లక్షల స్వల్ప తేడాతో చంద్రబాబు సీఎం పీఠం అధిరోహించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్‌ను పక్కనపడేసినట్టు కనిపించింది. రాజధాని భూసేకరణ సమయంలోనూ పవన్ మాటను పెడచెవిన పెట్టారు. పరిస్థితి చూస్తుంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసే సూచనలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో 2019లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఒకవేళ అదే జరిగితే కాపులు, పవన్ అభిమానులు ఈసారి టీడీపీకి దూరమవడం ఖాయం. అప్పుడు టీడీపీ గెలుపు అవకాశాలు భారీగా దెబ్బతింటాయి. అయితే ఇందుకు పవన్‌కు కౌంటర్‌గా ఇప్పటి నుంచే కొత్త యాక్టర్ కోసం టీడీపీ వెతుకుతోంది. ఇందుకు సంబంధించి టీడీపీ అనుకూల మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చింది. సదరు టీడీపీ పత్రిక కథనం ప్రకారం పవన్‌కు పోటీగా మహేష్‌బాబును తెరపైకి తెస్తున్నారట.
మహేష్‌బాబును టీడీపీ వైపు రప్పించే బాధ్యతను ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీసుకున్నారని కథనం. ఆ ప్రయత్నం విజయవంతమైన వెంటనే పవన్‌తో టీడీపీ కయ్యానికి కాలు దువ్వే అవకాశం ఉంది. అదే సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ టీడీపీకి కొన్ని లెక్కలున్నాయట. టీడీపీలో భవిష్యత్తుపై ఆశలతో ఉన్న ఎన్టీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయరని టీడీపీ నాయకత్వం ఒక నిర్ధారణకు వచ్చేసిందట. ఎటొచ్చి పవన్ వల్ల జరిగే నష్టాన్ని పూరించేందుకు మహేష్‌బాబును తెస్తే సరిపోతుందని టీడీపీ లెక్క అని కథనం. అంటే పవన్‌ను కరివేపాకులా వాడేయడం దాదాపు పూర్తయిందన్న మాట. పవన్ లేకపోయినా తమ వ్యూహం తమకు ఉందని టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినట్టుగా ఉంది. మహేష్ కాబోయే కొత్త కరివేపాకు అన్న మాట.
Click on Image to Read: