మళ్ళీ భంగపడ్డ టీడీపీ

సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం 34 వార్డులకు గాను 22 వార్డులను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చెరో 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఏడుచోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు, ఒకచోట ఎంఐఎం అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. బలమైన క్యాడర్‌ ఉందని చెప్పుకునే టీడీపీ మాత్రం పూర్తిస్థాయిలో భంగపడింది. ఒక్కవార్డును కూడా కైవసం చేసుకోలేకపోయింది. చైర్మన్‌ పీఠాన్ని అధిరోహించేందుకు 18 స్థానాలు అవసరం కాగా టీఆర్ఎస్ 22 స్థానాలను గెలుచుకోవడం […]

Advertisement
Update:2016-04-11 05:08 IST

సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం 34 వార్డులకు గాను 22 వార్డులను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చెరో 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఏడుచోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు, ఒకచోట ఎంఐఎం అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. బలమైన క్యాడర్‌ ఉందని చెప్పుకునే టీడీపీ మాత్రం పూర్తిస్థాయిలో భంగపడింది. ఒక్కవార్డును కూడా కైవసం చేసుకోలేకపోయింది. చైర్మన్‌ పీఠాన్ని అధిరోహించేందుకు 18 స్థానాలు అవసరం కాగా టీఆర్ఎస్ 22 స్థానాలను గెలుచుకోవడం ద్వారా సొంతంగానే చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. అయితే చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ అవకాశాలను స్వతంత్ర్య అభ్యర్థులు దెబ్బతీశారు. ఈ ఫలితాల ద్వారా తెలంగాణలో టీడీపీ ఉనికి మరోసారి ప్రశ్నార్థం అయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News