ప్రజా ప్రతినిథి అన్న గౌరవం కూడా లేకుండాపోయింది

ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీఎం చంద్రబాబు ప్రోత్సహించడాన్ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే విపక్ష ఎమ్మెల్యేలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుంటే స్పీకర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వారి వల్లే ప్రజాప్రతినిథులపై గౌరవం తగ్గిపోతోందన్నారు. చంద్రబాబు రాకముందు ఎమ్మెల్యే, మంత్రి అంటే ఎంతో గౌరవం ఉండేదన్నారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే బాధగా ఉందన్నారు. నిజంగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీ మారి […]

Advertisement
Update:2016-04-10 09:04 IST

ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీఎం చంద్రబాబు ప్రోత్సహించడాన్ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే విపక్ష ఎమ్మెల్యేలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుంటే స్పీకర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వారి వల్లే ప్రజాప్రతినిథులపై గౌరవం తగ్గిపోతోందన్నారు. చంద్రబాబు రాకముందు ఎమ్మెల్యే, మంత్రి అంటే ఎంతో గౌరవం ఉండేదన్నారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే బాధగా ఉందన్నారు. నిజంగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీ మారి ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

ఎన్నికల్లో బాబు అభివృద్ధి మీద ఓట్లు అడిగి, గెలిచి కాలర్ ఎగరేసుకుని తిరగాలన్నారు. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని బొత్స విమర్శించారు. చంద్రబాబు వ్యక్తిగత ఆరాధన కోరుకుంటున్నారని అన్నారు. రెండేళ్లలో 30 సార్లకు పైగా విశాఖ వెళ్లిన చంద్రబాబు ఏనాడైనా జిల్లా ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. కనీసం విశాఖలో తాగునీటి కష్టాల గురించి అయినా ఆలోచించారా అని నిలదీశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News