మోడీ విదేశీ ప్రయాణాలు...విమానంలోనే నిద్ర!
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన విదేశీ ప్రయాణాల్లో, ఆయన హోటల్ రూముల్లో నిద్రపోయింది చాలా తక్కువని, రాత్రులు ప్రయాణం చేస్తూ విమానాల్లోనే నిద్రపోయేవారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు ఆయన అమెరికా, బెల్జియం, సౌదీ అరేబియాల్లో పర్యటించారు. ఈ సందర్భంలో మోడీ ఢిల్లీనుండి బ్రస్సెల్స్‌కి, బ్రస్సెల్స్ నుండి వాషింగ్టన్‌కి, అక్కడినుండి రియాద్‌కి ప్రయాణం చేశారు. ఈ పర్యటనలో మూడు రోజులు రాత్రులే ప్రయాణం చేసి విమానంలోనే నిద్రపోయారు. […]
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన విదేశీ ప్రయాణాల్లో, ఆయన హోటల్ రూముల్లో నిద్రపోయింది చాలా తక్కువని, రాత్రులు ప్రయాణం చేస్తూ విమానాల్లోనే నిద్రపోయేవారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు ఆయన అమెరికా, బెల్జియం, సౌదీ అరేబియాల్లో పర్యటించారు. ఈ సందర్భంలో మోడీ ఢిల్లీనుండి బ్రస్సెల్స్‌కి, బ్రస్సెల్స్ నుండి వాషింగ్టన్‌కి, అక్కడినుండి రియాద్‌కి ప్రయాణం చేశారు. ఈ పర్యటనలో మూడు రోజులు రాత్రులే ప్రయాణం చేసి విమానంలోనే నిద్రపోయారు. రెండు రాత్రులు మాత్రమే హోటళ్లలో నిద్రపోయారు. అలా చేయడం వల్లనే మోడీ 97 గంటల్లో మొత్తం పర్యటను పూర్తి చేశారని లేకపోతే కనీసం ఆరురోజులు పట్టేదని ఆ అధికారి వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాను పదవిలోకి వచ్చిన రెండేళ్లలో 72 రోజులు విదేశాల్లో గడిపితే, మోడీ ఇదే కాలంలో 95రోజులపాటు విదేశాల్లో ఉన్నారు. అలాగే మోడీ 20 ట్రిప్పుల్లో 40 దేశాలు సందర్శించారు. మన్మోహన్ యుపిఎ ప్రభుత్వం మొదటి పాలనా కాలంలో 15 ట్రిప్పుల్లో 18 దేశాలు, యుపిఎ 2 ప్రభుత్వంలో 17 ట్రిప్పుల్లో 24 దేశాలు సందర్శించారు.