దేవాన్ష్ కు మోకరిల్లిన ప్రభుత్వ యంత్రాంగం
చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఏ1 కన్‌వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 11 గంటల వరకు పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆహ్వానించారు. దాదాపు 1000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ప్రముఖులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. మనవడి పుట్టినరోజు […]
చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని ఏ1 కన్‌వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 11 గంటల వరకు పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆహ్వానించారు. దాదాపు 1000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ప్రముఖులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
మనవడి పుట్టినరోజు వేడుక చంద్రబాబు కుటుంబ కార్యక్రమమైనప్పటికీ ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అప్పగించారని విమర్శలు వస్తున్నాయి. నాయకుల స్థాయినిబట్టి వారికి ఆహ్వానపత్రాలు అందజేసే బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తాశీల్దారులకు అప్పగించారని కథనాలొస్తున్నాయి.
కుటుంబ కార్యక్రమానికి ఇలా ఉన్నతాధికారుల సేవలను ఎలా ఉపయోగించుకుంటారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలెక్టర్లు నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించగా అనంతరం ఆర్డీవోలు, తాశీల్దారులు నేరుగా వెళ్లి ఆహ్వానపత్రాలు అందజేసినట్లు కథనం. నిజానికి దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే తిథి నక్షత్రం పేరుతో నేడు మరోసారి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.
Click on Image to Read: