రాముడు-గోవిందుడు

ఒక గ్రామంలో రాముడు, గోవిందుడు అన్న వ్యక్తులు వుండేవాళ్ళు. రాముడు ఐశ్వర్యవంతుడు, గోవిందుడు పేదవాడు. గోవిందుడు శివభక్తుడు. ఎంతో భక్తి శ్రద్ధల్తో శివుణ్ణి ప్రార్థించే వాడు కానీ అతని దరిద్రంపోలేదు. కుటుంబ పోషణ కష్టమయింది. చివరికి విసిగిపోయి నదిలో మునిగి చనిపోదామని ప్రయత్నించాడు. నీటిలో మునకవేస్తూనేవూపిరి ఆడక వుక్కిరిబి క్కిరయ్యాడు. పైకి లేచాడు. గట్టుమీద శివుడు ప్రత్యక్షమయ్యాడు. గోవిందుడు శివుని పాదాలపై పడి ప్రార్థించాడు అతని భక్తికి మొచ్చి శివుడు అతనికి మూడు కొబ్బరికాయలిచ్చి నువ్వు ఒక్క […]

Advertisement
Update:2016-04-06 18:32 IST

ఒక గ్రామంలో రాముడు, గోవిందుడు అన్న వ్యక్తులు వుండేవాళ్ళు. రాముడు ఐశ్వర్యవంతుడు, గోవిందుడు పేదవాడు. గోవిందుడు శివభక్తుడు. ఎంతో భక్తి శ్రద్ధల్తో శివుణ్ణి ప్రార్థించే వాడు కానీ అతని దరిద్రంపోలేదు. కుటుంబ పోషణ కష్టమయింది. చివరికి విసిగిపోయి నదిలో మునిగి చనిపోదామని ప్రయత్నించాడు. నీటిలో మునకవేస్తూనేవూపిరి ఆడక వుక్కిరిబి క్కిరయ్యాడు. పైకి లేచాడు. గట్టుమీద శివుడు ప్రత్యక్షమయ్యాడు. గోవిందుడు శివుని పాదాలపై పడి ప్రార్థించాడు అతని భక్తికి మొచ్చి శివుడు అతనికి మూడు కొబ్బరికాయలిచ్చి నువ్వు ఒక్క కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్క కోరిక కోరు అది నెరవేరుతుంది అన్నాడు.

గోవిందుడు శివునికి కృతజ్ఞతలు చెప్పి మూడు కొబ్బరికాయల్ని యింటికి తీసుకొచ్చాడు. శుభ్రంగా స్నానం చేసి దీపధూపాలతో దేవునికి నైవేద్యం సమర్పించి మొదటి కొబ్బరికాయకొడుతూ ‘స్వామీ! నాకు నివాసయోగ్యమయిన మంచియిల్లుకావాలి’ అని కోరుకున్నాడు. వెంటనే మంచి ఇల్లు ప్రత్యక్షమయింది.

తరువాత స్వామి! నాకు మంచి వరిపొలం కావాలి’ అని రెండో కొబ్బరి కాయకొట్టాడు. బీడు భూమి వరిపొలంగా మారింది. మూడో కొబ్బరి కాయకొట్టి బాగా డబ్బు కావాలి అన్నాడు. వేలరూపాయలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అతను ఆనందించి భగవంతునికి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు.

సాధారణంగా అన్నీ అమరిన వ్యక్తి అందరి కళ్ళల్లో పడడం సహజం. అతని జీవితం కళకళలాడింది. యిరుగుపొరుగు ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడూ తనని అడిగిన చిల్లిగవ్వకూడా యివ్వని రాము ఈ మార్పును గోవిందుని జీవితంలో చూసి ఆశ్చర్యపోయాడు. గోవిందుణ్ణి అడిగాడు గోవిందుడు కల్లాకపటం తెలీని వాడు. అంతా వివరించాడు.

రాముడు ఐశ్వర్యవంతుడయినా సంతృప్తి లేనివాడు ఆశపోతుగా వుంటాడు. రాముడు ఆశపోతు యింకా యింకా కావాలనుకునేవాడు అంతా నాకు కావాలనుకునే రకం. శివుని నుండి అద్భుతవరాలు పొందాలన్న ఆరాటం అతనికి కలిగింది.

రాముడు నది దగ్గరికి వెళ్ళి నీటిలో మునిగి వూపిరాడనట్లు నటించి పైకి లేచాడు. ఎదురుగా శివుడు ప్రత్యక్షం అయ్యాడు. రాముడు శివుని పాదాలపై పడ్డాడు. శివుడు నీకు ఏంకావాలని అడిగాడు. కోరికల్ని తీర్చేమూడు కొబ్బరి కాయాల్ని యివ్వమని కోరాడు. అతడు చిరునవ్వునవ్వి మూడు కొబ్బరి కాయల్ని యిచ్చాడు.

రాము యింటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు కొబ్బరి కాయల్ని కొడదామా? కోటి కోరికల్ని కోరుదామా? అని తొందరపడ్డాడు.

కొబ్బరికాయకు పసుపు, కుంకుమరాసి పగలగొట్టడానికి పైకెత్తి ఏ కోరికలు కొరుదామా? అని మొదట వజ్రాలు వైఢూర్యాలు కోరుదామా? బంగారు నగలు కోరుదామా అన్న విచికిత్సలో పడ్డాడు.

అప్పుడే అటుగా వచ్చిన బిచ్చగాడు అమ్మా! అంత అన్నం పెట్టండి’ అని అరిచాడు. రాముడు ఆలోచనలకు ఆటంకం కలిగింది బిచ్చగాడు ఆపకుండా అమ్మా! అని అరిచాడు. పైగా ఎదురుగా చేతిలో కొబ్బరి కాయపట్టుకున్న రాముడును చూసి’ నీ చేతిలో ఏందిస్వామీ’ అన్నాడు. రాము కోపంలో ‘ నీతలకాయ’ అంటు కొబ్బరికాయను పగలగొట్టాడు. ఆ కొబ్బకాయ ముక్కలన్నీ చిన్నవీ పెద్దవీ అన్ని బిచ్చగాడి తలలుగా మారిపోయాయి. ఆ దృశ్యంతో రాము బెంబేలెత్తి యింకో కొబ్బరి కాయ పైకెత్తి ‘తలలన్నీ మాయం కావాలి’ అని కొట్టాడు

ఆ దెబ్బతో తలలన్నీ మాయమయ్యాయి. రాము తలకుండా మయమైంది. దాంతో బిత్తరపోయిన రాముడు యింకో కొబ్బరికాయ తీసుకుని ‘నా తల నాకు రావాలి’ అని కొట్టాడు. అతని తల అతనికి వచ్చింది. ఆ రకంగా వరాల విలువ తెలీని దురాశాపరుడికి దు:ఖము మిగిలింది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News