ఆవగింజ

ఆవగింజ చిన్నదిగా వుంటుంది. దాదాపు కంటికి ఆననంత చిన్నదిగా వుంటుంది. కానీ ఘాటుగా వుంటుంది. ఇదొక రాజపుత్రుడి కథ. అతనూ ఆవగింజలా చిన్నవాడే కానీ చురుకయినవాడు. బలమైనవాడుఅతని పేరు వానాజీ అతను పసిపిల్లవాడుగా వున్నపుడే అతని తండ్రి చనిపోయాడు. మేనమామ సంరక్షణలో పెరిగాడు. కత్తియుద్ధం, విలువిద్య గుర్రపుస్వారి అన్నీ నేర్చుకున్నాడు. ఎవరూ లొంగదీయలేనిఒక గుర్రాన్ని లొంగదీసి మచ్చిక చేసుకున్నాడు. అప్పటి నించీ ఆ గుర్రం రాజకుమారుణ్ణి తప్ప ఎవర్నీ తన మీద కూచోడానికి అనుమతించేదికాదు. ఒక రోజు […]

Advertisement
Update:2016-04-05 18:32 IST

ఆవగింజ చిన్నదిగా వుంటుంది. దాదాపు కంటికి ఆననంత చిన్నదిగా వుంటుంది. కానీ ఘాటుగా వుంటుంది. ఇదొక రాజపుత్రుడి కథ. అతనూ ఆవగింజలా చిన్నవాడే కానీ చురుకయినవాడు. బలమైనవాడుఅతని పేరు వానాజీ అతను పసిపిల్లవాడుగా వున్నపుడే అతని తండ్రి చనిపోయాడు. మేనమామ సంరక్షణలో పెరిగాడు. కత్తియుద్ధం, విలువిద్య గుర్రపుస్వారి అన్నీ నేర్చుకున్నాడు. ఎవరూ లొంగదీయలేనిఒక గుర్రాన్ని లొంగదీసి మచ్చిక చేసుకున్నాడు. అప్పటి నించీ ఆ గుర్రం రాజకుమారుణ్ణి తప్ప ఎవర్నీ తన మీద కూచోడానికి అనుమతించేదికాదు.

ఒక రోజు కాండ్లా ప్రాంతం నుంచీ కత్తులు అమ్మే వ్యాపారివచ్చాడు. తన దగ్గరున్న ఖడ్గం మార్చాలని వానాజీ ఎప్పట్నించో అనుకుంటున్నాడు. వ్యాపారం తెచ్చిన ఖడ్గాల్ని పరిశీలించి తనకు నచ్చింది ఎంపికచేసుకున్నాడు. అది బరువైంది. ఐనా అది తన చేతిలో ఒదిగేలా చేసుకున్నాడు. కత్తుల విలువ తెలిసిన వ్యక్తి వానాజీ అని వ్యాపారస్థుడు పసికట్టాడు. వ్యాపారి ‘నా దగ్గరున్న వాటిల్లో యిదే చాలా విలువైందిఅన్నాడు’. ‘అవును నాకు నచ్చిందీయిదే దీంతో శత్రువులు నా దగ్గరికి రావడానికే జంకుతారు’ అన్నాడు వానాజీ.

ఆ కత్తి తీసుకుని వానాజీ తన మేనమామ దగ్గరికి వెళ్ళి దాన్ని తనకోసం కొనమని అడిగాడు. మేనమామ ‘మేము నీ పక్కనవున్నంతవరకు నీకు ఖడ్గంతో పని ఏముంది? పైగా అది చాలా పెద్దగావుంది’అన్నాడు.

కానీ నేను పెద్దవాణ్ణవుతున్నాను. ‘నా దగ్గరున్న ఖడ్గం చాలా చిన్నది’ అన్నాడు మేనమామ నవ్వి ‘కత్తి ఎంత పెద్దదన్నది కాదు విషయం నువ్వు శత్రువును ఎంత సాహసంతో ఎదుర్కొన్నావనేదిముఖ్యం’ అన్నాడు. దాంతో నిరాశ పడిన వానాజీ ఖడ్గాన్ని తిరిగి వ్యాపారస్థుడికి యిచ్చేశాడు.

ఒక రోజు వానాజీ మేనమామ ఏదో పని మీద వేరే వూరు వెళ్ళాడు. వానాజీ భవనంలో వున్నాడు. అంతలో ఏవో శబ్దాలు, పశువుల మెళ్ళో గంటల శబ్దాలు వినిపించాయి. వానాజీ సేవకుల్ని పిలిచి విషయమేమిటన్నాడు.

ఎక్కడో గ్రామంలో దొంగలు పడి పశువులన్నిట్నీ తోలుకుపోతున్నారు అన్నారు సేవకులు.

దాంతో వానాజీకి ఆవేశం కలిగింది.

‘నేనిక్కడున్నాను. మా గ్రామాల ప్రజలు బాధల్లోవుంటే వాళ్ళని యిట్లా నిస్సహాయంగా వదిలేస్తే మా మేనమామ ఏమనుకుంటారు.

మా తల్లి ఎంత తల్లడిల్లుతుంది. యిట్లా చేతులు వూపుకుంటూ వుండడం నాకే అవమానం. వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఎదురైనా రక్షించాలి. అది రాజపుత్రుడి ధర్మం ‘అనుకున్నాడు.

అప్పుడు తన గుర్రమెక్కి కత్తి పట్టుకుని దొంగలవెంట పడ్డాడు. వాళ్ళని అడవిలో వెంబడించి చివరకు దొంగల నాయకుణ్ణి చేరుకున్నాడు. ఆ దొంగల నాయకుడు నవ్వి ‘ నువ్వు పసివాడివి నీకింకా మీసాలురాలేదు. నువ్వొక్కడివే ఈ పశువులనన్నిట్నీ తీసుకుని పోగలవని అనుకుంటున్నావా!’ అని అన్నాడు.

వానాజీ అతన్తో మాటలు పెంచడానికి యిష్టపడక కత్తి దూశాడు అతను పక్కకి తప్పుకునేంతలో దొంగల నాయకుడి ముక్కు తెగింది. దొంగల నాయకుడు కోపంతో తన సేవకుల్తో ‘వెంటనే ఈ కుర్రాణ్ణి చంపెయ్యండి’ అన్నాడు. వాళ్ళ వానాజీతో తలపడ్డారు. ఈ మధ్యలో పశువులు తిరుగుముఖం పట్టి తమ యిళ్ళకు చేరాయి.

వీళ్ళతో యుద్ధం చేస్తూ సమయం వ్యర్థం చేయడం ఎందకని వానాజీ గుర్రాన్ని వెనక్కి తిప్పి దౌడు తీయించాడు. దొంగలు వెంబడించారు కానీ అతని గుర్రాన్ని అందుకోలేకపోయారు.

దిగులుగా వున్న గ్రామస్థులు దుమ్మూధూళి లేచి తరువాత పశువులు వాటి వెంట రాజకుమారుడు రావడం చూశారు. గ్రామస్థులు సంతోషంతో ఎదురయి ‘రాజాకుమారా! నువ్వు చిన్నవాడివి. యింతశ్రమతీసుకున్నావు. పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నావు’ అన్నారు.

వానాజీ ‘నేను చిన్నవాణ్ణే కాని ఆవగింజ లాంటి వాణ్ణి దానిని లాగే నాకు ఘాటు ఎక్కువ’ అన్నాడు.

గ్రామస్థులు నవ్వుకుని అతని సాహసానికి అభినందించారు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News