ఈ వృత్తులు… అనారోగ్యాలకు బాట‌లు!

కొన్ని వృత్తుల్లో ఉన్న‌వారు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, హానిచేసే అల‌వాట్ల వ‌ల‌న త్వ‌ర‌గా జ‌బ్బుల బారిన ప‌డ‌తార‌ని, వారి గుండె ప‌దికాలాలపాటు ప‌దిలంగా ఉండే అవ‌కాశం లేద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. 5,566 మందిపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన ప‌రిశోధ‌కులు వారు తీసుకునే ఆహారం, ఇత‌ర అల‌వాట్ల‌ను గ‌మ‌నించారు. రక్త‌పోటు, ర‌క్తంలో షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, ఫిట్‌నెస్ స్థాయి, ఆహారం, పొగ‌తాగ‌టం, అధిక‌బ‌రువు….ఈ విష‌యాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చూడ‌గా, ఏడు వృత్తుల్లో ఉన్న‌వారు త్వ‌ర‌గా అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గురి అవుతున్నార‌ని తేలింది. -ఇందులో మొద‌టి వృత్తి సేల్స్ […]

Advertisement
Update:2016-04-02 10:03 IST

కొన్ని వృత్తుల్లో ఉన్న‌వారు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, హానిచేసే అల‌వాట్ల వ‌ల‌న త్వ‌ర‌గా జ‌బ్బుల బారిన ప‌డ‌తార‌ని, వారి గుండె ప‌దికాలాలపాటు ప‌దిలంగా ఉండే అవ‌కాశం లేద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. 5,566 మందిపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన ప‌రిశోధ‌కులు వారు తీసుకునే ఆహారం, ఇత‌ర అల‌వాట్ల‌ను గ‌మ‌నించారు. రక్త‌పోటు, ర‌క్తంలో షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, ఫిట్‌నెస్ స్థాయి, ఆహారం, పొగ‌తాగ‌టం, అధిక‌బ‌రువు….ఈ విష‌యాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చూడ‌గా, ఏడు వృత్తుల్లో ఉన్న‌వారు త్వ‌ర‌గా అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గురి అవుతున్నార‌ని తేలింది.

-ఇందులో మొద‌టి వృత్తి సేల్స్ మేన్‌లు. ఈ వృత్తిలో ఉన్న‌వారు త‌మ ఆరోగ్యాన్ని కూడా అమ్మేస్తున్నార‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. వీరిలో 68శాతం మందిలో ఆహార‌పు అల‌వాట్లు స‌రిగ్గా లేవ‌ని, అనారోగ్యాన్ని క‌లిగించేవిగా ఉన్నాయ‌ని, 69శాతం మందిలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంద‌ని గ‌మ‌నించారు.

-ఆఫీసుల్లో ప‌రిపాల‌న‌కు సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న‌వారిలో శారీర‌క శ్ర‌మ ఏమాత్రం లేద‌ని, త‌ద్వారా వారు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నార‌ని గుర్తించారు.

-పోలీసు, ఫైర్ సిబ్బంది కూడా అనారోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లు ఉన్న‌వారిలో ఉన్నారు. ఈ రంగాల్లోని వారిలో 90శాతం మంది అధిక‌బ‌రువు, స్థూలకాయంతో ఉన్నారు. 77శాతం మందిలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంది. 35శాతం మందిలో బిపి ఎక్కువ‌గా ఉంది.

-ర‌వాణా, స‌రుకు త‌ర‌లింపు ప‌నుల్లో ప్ర‌యాణాల్లో గ‌డిపేవారిలో ఎక్కువ‌మంది పొగ‌తాగుతున్న‌ట్టుగా గుర్తించారు. దాంతో వారి ఆరోగ్యం పాడవుతున్న‌ట్టుగా గ‌మ‌నించారు.

-ఆహార ప‌దార్థాలు అమ్మే చోట్ల ప‌నిచేసేవారిలో ఆహార‌పు అల‌వాట్లు ఆరోగ్య‌క‌రంగా లేవ‌ని గుర్తించారు. వీరిలో 79శాతం మంది స‌రైన ఆహారం తీసుకోవ‌డం లేద‌ని తేలింది.

ఇక ఆరోగ్యక‌ర‌మైన అల‌వాట్లు ఉన్న‌వారిలో డాక్ట‌ర్లు లాయ‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. మంచి ఆహార‌పు అల‌వాట్ల‌తో పాటు వీరిలో 75శాతం మంది త‌గిన వ్యాయామం చేస్తున్నారు. మూడింటా ఒక వంతు మందికి బాడీమాస్ ఆరోగ్య‌కరంగా ఉంది. ఇంకా మేనేజ‌ర్ స్థాయిలో ప‌నిచేస్తున్న వారిలో కూడా ఆహార‌పు అల‌వాట్లు బాగున్నాయి. వీరిలో 6శాతం మంది మాత్ర‌మే సిగ‌రెట్ తాగుతున్నారు. అయితే ఫైనాన్స్‌, వ్యాపార రంగాల్లో ఉన్న మేనేజ‌ర్లలో మాత్రం స‌రైన ఆహార‌పు అల‌వాట్లు లేవ‌ని గుర్తించారు. ఆర్థిక మాంద్య ప‌రిస్థితుల కార‌ణంగా త‌లెత్తిన ఒత్తిడే ఇందుకు కార‌ణ‌మ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది.

Tags:    
Advertisement

Similar News