రాయలసీమను కించపరిస్తే జాగ్రత్త!.. సినిమా వాళ్లకు శ్రీకాంత్‌ రెడ్డి వార్నింగ్

రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడారు.  ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పనిచేస్తోందని మండిపడ్డారు.  పట్టిసీమ పూర్తయితే రాయలసీమకు నీరొస్తాయని చెప్పారని… మరీ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే తమ ప్రాంతానికి నీరెందుకు రావడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854అడుగులు ఉంచాలని వేడుకున్నా వినకుండా ఏకంగా 790 అడుగులకు నీటిమట్టాన్ని తీసుకెళ్లారని ఆవేదన చెందారు. రాజధాని ప్రకటన రోజు జిల్లా వారీగా నెలకొల్పే సంస్థల జాబితా చదివిన చంద్రబాబు ఇప్పుడు […]

Advertisement
Update:2016-03-30 09:41 IST

రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమకు నీరొస్తాయని చెప్పారని… మరీ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే తమ ప్రాంతానికి నీరెందుకు రావడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854అడుగులు ఉంచాలని వేడుకున్నా వినకుండా ఏకంగా 790 అడుగులకు నీటిమట్టాన్ని తీసుకెళ్లారని ఆవేదన చెందారు. రాజధాని ప్రకటన రోజు జిల్లా వారీగా నెలకొల్పే సంస్థల జాబితా చదివిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.

ఐటీ కారిడార్, కెమికల్ కారిడార్, పరిశ్రమలు, ఓడరేవులు, ఎయిమ్స్, రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఇలా మొత్తం అన్ని తీసుకెళ్లి ఇప్పుడు అమరావతిలోనే పెడుతున్నారని చెప్పారు. ఇలా అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించడం వల్లే రాష్ట్రం ముక్కలైందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. చివరకు వెనుకబడిన అనంతపురంలో నెలకోల్పుతామని చెప్పిన ఎయిమ్స్‌ను కూడా అమరావతికే తీసుకెళ్లారని గుర్తు చేశారు. రాయలసీమ సంస్కృతిని కూడా పదేపదే కించపరుస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

అక్కడెక్కడో రైలు తగలబడిపోతే దాన్ని రాయలసీమ గూండాలు వచ్చి చేశారని కించపరుస్తున్నారని అన్నారు. సినిమాల్లోనూ మాటకు ముందు రాయలసీమ రౌడీలు, గూండాలు అంటూ కించపరుస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో వస్తే నలుగురికి అన్నం పెట్టే సంస్కృతి తమదన్నారు. తమ దగ్గర లేకున్నా అప్పు చేసైనా ఆకలి తీర్చే గుణం రాయలసీమ వారిదన్నారు. ఇకపై ఏ సినిమాలోనైనా రాయలసీమను కించపరిస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా రాయలసీమ గూండాలు, రౌడీలు అంటూ ఒక ప్రాంతాన్ని కించపరచడం మానుకోవాలని కోరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News