అధికబరువు ముప్పుకి విరుగుడు
బరువు తగ్గాలనుకుంటున్నవారు వేరుశనగపప్పు(పల్లీలు) తింటే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు లేదా నాలుగుసార్లు వీటిని తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా బరువు తగ్గుతుందని అమెరికా ఆహార శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒబెసిటీకి గురయ్యే అవకాశం ఉన్న టీనేజి పిల్లలు పల్లీలు తిన్నప్పుడు వారి బాడీ మాస్ ఇండెక్స్ తగ్గటం, వీటిని తినని వారిలో అలాంటి ఫలితం కనిపించకపోవడం పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని హూస్టన్ ప్రాంతానికి చెందిన 257మంది టీనేజిలో ఉన్న విద్యార్థులను […]
బరువు తగ్గాలనుకుంటున్నవారు వేరుశనగపప్పు(పల్లీలు) తింటే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు లేదా నాలుగుసార్లు వీటిని తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా బరువు తగ్గుతుందని అమెరికా ఆహార శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒబెసిటీకి గురయ్యే అవకాశం ఉన్న టీనేజి పిల్లలు పల్లీలు తిన్నప్పుడు వారి బాడీ మాస్ ఇండెక్స్ తగ్గటం, వీటిని తినని వారిలో అలాంటి ఫలితం కనిపించకపోవడం పరిశోధకులు గుర్తించారు.
అమెరికాలోని హూస్టన్ ప్రాంతానికి చెందిన 257మంది టీనేజిలో ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుని 12వారాలపాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో సగం మందికి పల్లీలు లేదా వాటి వెన్నతో తయారైన పదార్థాలను వారానికి మూడునుండి నాలుగుసార్లు చిరుతిండిగా ఇచ్చారు. మిగిలినవారికి అంతకంటే చాలా తక్కువ సార్లు వీటిని ఇచ్చారు.
క్రమం తప్పకుండా పల్లీలు తిన్నవారిలో, తిననివారిలో కంటే బరువు తగ్గినట్టుగా, వారి బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టినట్టుగా పరిశోధకులు గుర్తించారు. పోషకాల సాంద్రత ఎక్కువగా ఉండటం వలన పల్లీలు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయని వీరు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన చిరుతిండిగా వీటిని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.