వైసీపీ నేత శీలపరీక్ష- ‘’విషమైనా తీసుకుంటా’’…

ఒకవర్గం మీడియా కథనాలతో వైసీపీ నేతలు పదేపదే శీలపరీక్షకు నిలవాల్సి వస్తోంది. ఫలాన వైసీపీ నేత పార్టీ వీడుతున్నారని కథనాలు రావడం వెంటనే వారు ఖండన ఇవ్వాల్సి రావడం జరుగుతోంది. తాజాగా వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ జాబితాలో చేరారు. తాను పార్టీ వీడుతున్నట్టు వస్తున్న కథనాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  విషమైనా తీసుకుంటాను కానీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.  ప్రాణమున్నంతవరకు వైఎస్‌ కుటుంబంతోనే ఉంటానన్నారు. […]

Advertisement
Update:2016-03-25 04:37 IST

ఒకవర్గం మీడియా కథనాలతో వైసీపీ నేతలు పదేపదే శీలపరీక్షకు నిలవాల్సి వస్తోంది. ఫలాన వైసీపీ నేత పార్టీ వీడుతున్నారని కథనాలు రావడం వెంటనే వారు ఖండన ఇవ్వాల్సి రావడం జరుగుతోంది. తాజాగా వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ జాబితాలో చేరారు. తాను పార్టీ వీడుతున్నట్టు వస్తున్న కథనాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విషమైనా తీసుకుంటాను కానీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రాణమున్నంతవరకు వైఎస్‌ కుటుంబంతోనే ఉంటానన్నారు. తాను టీడీపీలో చేరుతున్నట్టుగా కావాలనే పుకార్లు సృష్టిస్తున్నారని నాని మండిపడ్డారు.

గతంలో జగన్‌ వెంట నడిచేందుకు ఏడాదిన్నరకు ముందే ఎమ్మెల్యే, విప్ పదవులను త్యజించి వైఎస్సార్ సీపీలో చేరానని గుర్తుచేశారు. తాను పదవుల కోసమే ఆలోచించే వ్యక్తినే అయితే ఏడాదిన్నరకు ముందే క్యాబినెట్ హోదా గల విప్ పదవిని వదలి పార్టీ మారేవాడినే కాదన్నారు.

తనకు వైఎస్సార్‌పై అపారమైన, అచంచలమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, తన ఊపిరి ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబంతోనే ఉంటానన్నారు. తనకు ఊహ వచ్చినప్పటి నుంచీ టీడీపీపై వ్యతిరేకతతోనే పెరిగానని, అలాంటి తాను నేడు ఆ పార్టీలో ఏమి ఆశించి చేరాలని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి మైలు రాళ్లు అనేకం ఉన్నాయని అవే తనకు సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News