భార్యతో విడాకులకు ఆసక్తికర కారణం చెప్పిన వర్మ

వివాదాల వర్మ తన మనసులో ఏం అనిపిస్తే అది బయటకు చెప్పేస్తుంటారు. మొహమాటం అస్సలు లేదు. పర్సనల్ విషయాలను కూడా చాలా బయటకు చెప్పేస్తుంటారు. జనం మాట్లాడేందుకు జంకే విషయాలపైనా నిర్భయంగా అభిప్రాయాలు చెబుతుంటారు. తాజాగా భార్యకు ఎందుకు విడాకులివ్వాల్సి వచ్చిందో తనంతటతానే చెప్పుకున్నాడు. ఎటాక్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న వర్మ.. భార్యతో విడాకులకు గజల్సేనని చెప్పారు. అది కూడా గజల్ శ్రీనివాస్ సమక్షంలోనే చెప్పాడు. తన భార్యకు గజల్స్ అంటే చాలా ఇష్టమని, తనకు […]

Advertisement
Update:2016-03-24 11:01 IST

వివాదాల వర్మ తన మనసులో ఏం అనిపిస్తే అది బయటకు చెప్పేస్తుంటారు. మొహమాటం అస్సలు లేదు. పర్సనల్ విషయాలను కూడా చాలా బయటకు చెప్పేస్తుంటారు. జనం మాట్లాడేందుకు జంకే విషయాలపైనా నిర్భయంగా అభిప్రాయాలు చెబుతుంటారు. తాజాగా భార్యకు ఎందుకు విడాకులివ్వాల్సి వచ్చిందో తనంతటతానే చెప్పుకున్నాడు. ఎటాక్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న వర్మ.. భార్యతో విడాకులకు గజల్సేనని చెప్పారు. అది కూడా గజల్ శ్రీనివాస్ సమక్షంలోనే చెప్పాడు.

తన భార్యకు గజల్స్ అంటే చాలా ఇష్టమని, తనకు మాత్రం ఆ సౌండ్ పడేది కాదన్నారు. రాత్రిపూట తన భార్య ఇంట్లో గజల్స్ ప్లే చేసిది అని గుర్తు చేసుకున్నారు. తాను మాత్రం ఇళయరాజా సంగీతం వినాలనుకునే వాడినని వెల్లడించారు. ఆమె గజల్ సౌండ్‌కు ఇబ్బంది పడేవాడినని అందుకే విడాకులు తీసుకున్నానని చెప్పారు. అటాక్ సినిమాలో పాటను గజల్ శ్రీనివాస్ చేత పాడిస్తే బాగుంటుందని రచయిత సిరాశ్రీ సూచించారని చెప్పారు. తనకు గజల్స్ నచ్చని విషయాన్ని పక్కన పెడితే అటాక్ సినిమాలో మాత్రం గజల్ శ్రీనివాస్ అసాధారణంగా పాడారని వర్మ చెప్పారు.

అవి తనకు నచ్చవని తెలిపాడు. ఇళయ రాజా సంగీతాన్ని వినేందుకే తాను ఎక్కువగా ఇష్టపడతానని వర్మ అన్నారు. రాత్రిపూట ఇంట్లో నా భార్య గజల్స్ ప్లే చేసేది. నేను నాకిష్టమైన పాటలు వినాలనుకనేవాడిని. ఇదే విడాకులకు ఓ కారణంగా మారిందని వర్మ పేర్కొన్నారు. అయితే గజల్‌ శ్రీనివాస్‌ తో పరిచయం తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వర్మ తెలిపారు. రవిశంకర్‌ చాలా చక్కని మ్యూజిక్‌ ఇచ్చాడన్నారు. ధూల్‌పేట ప్రాంతంలో మూసీనది సమీపంలో చెమటలు పట్టి, ముఖాలకు మట్టి అంటుకొని ఉండే పాత్రలతో, ఒక అగ్లీ కైండ్‌ ఆఫ్‌ అట్మాస్పియర్‌లో ఎటాక్ సినిమా నడుస్తుందని వర్మ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News