పాక్ ఓడితే భారత్ మాతా కీ జై ఎందుకు?
టీ 20లో ఇండియా పాకిస్థాన్ పై గెలిచింది. సంతోషం. కానీ దానికీ..భారత్ మాతా కీ జై నినాదాలకి సంబంధం ఏమిటి? ఇండియా విన్ అవ్వగానే సోషల్ మీడియాలో చాలా మంది భారత్ మాతా కీ జై అంటూ కామెంట్స్ పోస్ట్ చేసారు. కొంతమంది రోడ్ల మీదకు వచ్చి భారత్ మాతా కీ జై అంటూ స్లొగన్స్ ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం?! ఆఫ్టర్ అల్ ఇట్స్ ఏ గేమ్. ఇండో పాక్ మ్యాచ్ కాబట్టి అంచనాలు సహజం. […]
టీ 20లో ఇండియా పాకిస్థాన్ పై గెలిచింది. సంతోషం. కానీ దానికీ..భారత్ మాతా కీ జై నినాదాలకి సంబంధం ఏమిటి? ఇండియా విన్ అవ్వగానే సోషల్ మీడియాలో చాలా మంది భారత్ మాతా కీ జై అంటూ కామెంట్స్ పోస్ట్ చేసారు. కొంతమంది రోడ్ల మీదకు వచ్చి భారత్ మాతా కీ జై అంటూ స్లొగన్స్ ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం?! ఆఫ్టర్ అల్ ఇట్స్ ఏ గేమ్. ఇండో పాక్ మ్యాచ్ కాబట్టి అంచనాలు సహజం. ఎవరి టీం వాళ్ళు నెగ్గాలని కోరుకోవడం ఇంకా సహజం. కానీ మన దేశ భక్తిని ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్ వరకే పరిమితం చేయడమే అసలైన విషాదం.
ద్వేషం రాజేసిన మీడియా
ఇక్కడ ఇండియా గెలిచినందుకు కాదు, పాకిస్తాన్ ఓడిపోవడమే మనవాళ్ళ సంతోషానికి కారణం. ఇది మంచి పరిణామం కాదు. గత 30 ఏళ్లుగా మీడియా కూడా హైప్ క్రియేట్ చేస్తోంది. దాయాదుల సమరం అంటూ రెండు జట్లనూ చిరకాల ప్రత్యర్థులను చేసింది. దీనివల్ల ఇరు దేశాల ప్రజలు ఇండో పాక్ మ్యాచ్ అంటే యుద్ధంలానే ఫీల్ అవుతున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. ద్వేషం చిమ్ముకుంటున్నారు. ఇది ఇంకెంత కాలం?
మనకు పాక్ ప్రజలతో తగవు లేదు. మనతో పాక్ ప్రజలకు ఆస్తి తగాదాలు లేవు. అయినా మన మధ్య స్నేహ వారధిగా ఉండాల్సిన క్రికెట్..యుద్దాన్ని తలపిస్తోంది. విద్వేషాలను రాజేస్తోంది. యాషెస్ సెరీస్ని అడ్డుపెట్టుకుని టీవీ చానెళ్ళు, కార్పొరేట్ సంస్థలు ఇలాగే వ్యాపారం చేసాయి. కానీ ఇంగ్లండ్-ఆసీస్ మధ్య వైరం మైదానం వరకు మాత్రమే. కానీ ఇండో పాక్ క్రికెట్ రెండు దేశాల సంబంధాలను శాసిస్తోంది. అందుకే ఆటని ఆటలా మాత్రమే రిపోర్ట్ చేస్తే బాగుంటుంది.
చెస్, బ్యాడ్మింటన్, షూటింగ్, కబడ్డీ, టెన్నిస్ లో మనవాళ్ళు విజయాలు సాధించినప్పుడు కూడా భారత్ మాతా కీ జై అంటే బాగుంటుంది. కనీసం మహిళా క్రికెట్ సాధిస్తున్న విజయాలను మనమెప్పుడయినా కీర్తించామా?? వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం మన మాజీ సైనికుల పోరాటానికి మద్దతిచ్చామా?
దయచేసి దేశ్ భక్తిని ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్ కి పరిమితం చేయకండి. జాతీయవాదం ఉన్మాదానికి చేరి యుద్ధాలకు దారితీస్తుందన్న ఐన్ స్టీన్ మాటల్ని గుర్తుంచుకొండి.