సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై వైసీపీ నోటీసులు
అధికారపక్షంపై వైసీపీ కౌంటర్ అటాక్ తీవ్రం చేసింది. కోర్టు ఆదేశాల ఇచ్చాక కూడా రోజాను సభలోకి అనుమతించకపోవడం, శనివారం ప్రివిలేజ్ కమిటీ అత్యవసర భేటీ నేపధ్యంలో వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడుపై నోటీసు ఇచ్చారు. బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మంత్రులు .. జగన్‌తో పాటు విపక్ష సభ్యులపై దూషణలకు దిగినందుకు […]
అధికారపక్షంపై వైసీపీ కౌంటర్ అటాక్ తీవ్రం చేసింది. కోర్టు ఆదేశాల ఇచ్చాక కూడా రోజాను సభలోకి అనుమతించకపోవడం, శనివారం ప్రివిలేజ్ కమిటీ అత్యవసర భేటీ నేపధ్యంలో వైసీపీ కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడుపై నోటీసు ఇచ్చారు.
బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మంత్రులు .. జగన్‌తో పాటు విపక్ష సభ్యులపై దూషణలకు దిగినందుకు ఈ నోటీసులు ఇచ్చారు. సభలో అచ్చెన్నాయుడు జగన్‌ను ఉద్దేశించి ‘’కొవ్కెక్కింది’’ అని అన్నారు. కామినేని ఒకసారి జగన్‌ను ‘’సైకో’’ అన్నారు. దేవినేని ఉమ వేలు చూపుతూ ‘’ఖబర్దార్ జగన్’’ అని హెచ్చరించారు. చంద్రబాబు విపక్ష నేతలను “రౌడీలు” అని సంబోధించారు. “సిగ్గులేదా” అని దూషించారు.
వీటితో పాటు పలుమార్లు ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మంత్రులు తీవ్ర పదజాలం వాడారు. కానీ వారిని స్పీకర్ నిలువరించలేదు. ఈ నేపథ్యంలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది వైసీపీ. శనివారం అత్యవసరంగా సమావేశమవుతున్న ప్రివిలేజ్ కమిటీ రోజా వ్యవహారంపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైనా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నది వైసీపీ డిమాండ్ .
Click on Image to Read: