మాల్యా నివాసం వేలం!

కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజ‌య్‌మాల్యా ఇంటిని నేడు వేలం వేయ‌నున్నారు. వివిధ బ్యాంకుల‌కు 9,500 కోట్ల మేర‌కు  రుణాలు ఎగ్గొట్టి మాల్యా విదేశాల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎస్‌బిఐ అధికారులు ముంబ‌యిలో ఉన్నఆయ‌న ఇంటిని ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అంథేరి ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి ప్రారంభ ధ‌ర 150 కోట్లుగా నిర్ణ‌యించారు. మాల్యాకు రుణాలు ఇచ్చిన 17 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. మాల్యాకు ముంబ‌యి, […]

Advertisement
Update:2016-03-17 06:35 IST

కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజ‌య్‌మాల్యా ఇంటిని నేడు వేలం వేయ‌నున్నారు. వివిధ బ్యాంకుల‌కు 9,500 కోట్ల మేర‌కు రుణాలు ఎగ్గొట్టి మాల్యా విదేశాల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎస్‌బిఐ అధికారులు ముంబ‌యిలో ఉన్నఆయ‌న ఇంటిని ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అంథేరి ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి ప్రారంభ ధ‌ర 150 కోట్లుగా నిర్ణ‌యించారు. మాల్యాకు రుణాలు ఇచ్చిన 17 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. మాల్యాకు ముంబ‌యి, ఢిల్లీ, గోవాల్లోనే కాక లండ‌న్‌లోనూ విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు ఉన్నాయి. మాల్యాని విదేశాల‌కు వెళ్ల‌కుండా నిలువ‌రించాల‌ని బ్యాంకులు సుప్రీం కోర్టుని కోర‌గా, ఆయ‌న మార్చి 2నే దేశం వ‌దిలి వెళ్లిపోయాడ‌ని ప్ర‌భుత్వం కోర్టుకి తెలిపిన సంగ‌తి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News