మీడియాకు లిక్కర్ డాన్‌ బెదిరింపు ట్వీట్

బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రుణం ఎగ్గొట్టి పరాయిదేశానికి పారిపోయిన విజయ్ మాల్యాకు పౌరుషం, కోపం వచ్చింది.  తనపై భారతమీడియా విరుచుకుపడుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నాడు లిక్కర్ డాన్. ఏకంగా శాపనార్థాలతో ట్వీట్ పెట్టారు. తాను ఎక్కడికీ పారిపోలేదంటూనే… ప్రస్తుతం ఎక్కడున్నది మాత్రం చెప్పలేదు ఈ ఆర్ధిక ఉగ్రవాది. తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టానికి కట్టుబడి ఉంటానని శుక్రవారం తెల్లవారుజామున వరుస ట్వీట్లు చేశారు. ‘నేనొక అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తను. డిఫాల్టర్‌ను కాదు. దేశాలు తిరగటం కొత్తకాదు. అలాంటి […]

Advertisement
Update:2016-03-11 04:49 IST

బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రుణం ఎగ్గొట్టి పరాయిదేశానికి పారిపోయిన విజయ్ మాల్యాకు పౌరుషం, కోపం వచ్చింది. తనపై భారతమీడియా విరుచుకుపడుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నాడు లిక్కర్ డాన్. ఏకంగా శాపనార్థాలతో ట్వీట్ పెట్టారు. తాను ఎక్కడికీ పారిపోలేదంటూనే… ప్రస్తుతం ఎక్కడున్నది మాత్రం చెప్పలేదు ఈ ఆర్ధిక ఉగ్రవాది.

తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టానికి కట్టుబడి ఉంటానని శుక్రవారం తెల్లవారుజామున వరుస ట్వీట్లు చేశారు. ‘నేనొక అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తను. డిఫాల్టర్‌ను కాదు. దేశాలు తిరగటం కొత్తకాదు. అలాంటి నాపై పారిపోయాడంటూ పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలన్నీ అవాస్తవం. బాధ్యతగల ఎంపీగా నేను చట్టాన్ని గౌరవిస్తాను. రుణాలకు సంబంధించిన వ్యవహారాల్ని చట్టపరంగానే ఎదుర్కొంటాను’ అంటూ ట్విట్ చేశారు.

అంతటితో ఆగలేదు మాల్యా. మీడియాపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు . మీడియా బాసులు తన నుంచి చాలా లబ్ధి పొందారని చెప్పారు. మీడియా బాసుల కోసం ఎంతో ఖర్చు చేశాను. కొన్నేళ్లుగా వారికి చాలాసార్లు సౌకర్యాలు కల్పించా. వాటికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్ల రూపంలో ఉన్నాయంటూ ఒక బ్లాక్‌ మెయిల్ ట్వీట్‌ను చేశారు. టైమ్స్‌ నౌ చానల్ పేరు ప్రస్తావిస్తూ చానల్‌ ఎడిటర్‌పై ఆక్రోశం వెల్లగక్కారు. జైల్లో చిప్ప కూడు తినాలంటూ శాపనార్థాలు చెప్పారు మాల్యా. ఇన్ని నీతులు చెప్పి కూడా తాను ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నది మాత్రం చెప్పలేదు.

Tags:    
Advertisement

Similar News