ఇది విషమైతే… అప్పుడు చిమ్మింది అమృతమా ధూళిపాళ్లా?

సాక్షి కథనాలపై  టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో ఆవేదక వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను, టీవీని అడ్డుపెట్టుకుని తమ వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నారని రగిలిపోయారు. తమ వ్యక్తిత్వంతో పాటు అమరావతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇలా తమ వ్యక్తిత్వాన్నిహత్య చేసే హక్కు సాక్షికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పెట్టుబడులు రాకుండా ఉండేందుకే తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహించారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర గతాన్ని మరిచినట్టుగా ఉన్నారు. రాజధానిలో చేసిన భూకుంభకోణాలపై కథనాలు రాస్తే అలా చేయడం […]

Advertisement
Update:2016-03-09 07:20 IST

సాక్షి కథనాలపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో ఆవేదక వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను, టీవీని అడ్డుపెట్టుకుని తమ వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నారని రగిలిపోయారు. తమ వ్యక్తిత్వంతో పాటు అమరావతి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇలా తమ వ్యక్తిత్వాన్నిహత్య చేసే హక్కు సాక్షికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పెట్టుబడులు రాకుండా ఉండేందుకే తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆగ్రహించారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర గతాన్ని మరిచినట్టుగా ఉన్నారు.

రాజధానిలో చేసిన భూకుంభకోణాలపై కథనాలు రాస్తే అలా చేయడం వ్యక్తిత్వాన్ని చంపేయడమే అంటున్నారు. మరి వైఎస్ చనిపోయిన తర్వాత నుంచి జగన్‌ విషయంలో ఇప్పటి వరకూ టీడీపీ నేతలు చేస్తున్నదేమిటో?. టీడీపీ అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని జగన్‌ అవినీతి పరుడు, శాడిస్టు, ఉన్మాది, సైకో, లక్ష కోట్లు దోచుకున్న దోపిడిదారుడు అంటూ విమర్శిస్తూ వచ్చారు కదా. నోరుంది కదా అని అలా ఉన్మాది, సైకో వంటి దిగజారుడుపదాలతో విమర్శించడం అంటే జగన్ వ్యక్తిత్వాన్ని హత్య చేయడం కాదా?. వ్యక్తిత్వం అన్నది టీడీపీ నేతలకు మాత్రమే సొంతమా?. వైఎస్ చనిపోయిన కొన్ని నెలలు కూడా గడవకముందే పాపం పండింది అంటూ తాటికాయంత అక్షరాలతో టీడీపీ అనుకూల పత్రికలు కథనాలు రాసినప్పుడు వైఎస్ కుటుంబసభ్యులు ఎంత బాధపడి ఉంటారో అర్థం కాలేదా? గడిచిన పదేళ్లుగా మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని జగన్‌, వైఎస్‌ మీద కట్టకట్టలుగా కథనాలు రాశారు కదా!. ఇప్పుడు సాక్షి రాసిన ఒక కథనానికే ధూళిపాళ్ల వ్యక్తిత్వం హత్యకు గురై ఉంటే … పదేళ్ల కాలంలో వైఎస్‌ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు హత్య చేయించారనుకోవాలి. నరేంద్ర మరో విషయం కూడా చెప్పారు.

రాజధానిలో వేల ఎకరాలు భూకుంభకోణం జరిగితే దానిపై సాక్షి కథనాలు రాయడం వల్ల అమరావతి బ్రాండ్ దెబ్బతింటోదని చెబుతున్నారు. అమరావతిలో కుంభకోణం జరిగిందా లేదా అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మరి అప్పట్లో కడపలో వైఎస్‌ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటే బాబుగారి పత్రికలు రాసిన కథనాలు గుర్తున్నాయా ? గడ్డి కూడా వర్షకాలంలో మాత్రమే కనిపించే కడప జిల్లాలోని బీడు భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నిస్తే బాబు పత్రికలు ఏం రాశాయి?. జింక పిల్లలు చిందులేసే, కుందేళ్లు కూత పెట్టే, నెమళ్లు పురివిప్పి ఆడే ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎలా పెడుతారు?.. పర్యావరణం ఏం కావాలి! అని బాబు మీడియా గగ్గోలు పెట్టింది.

నిజానికి ఆ కథనాలు చూసి కడప జిల్లా జనమే ఆశ్చర్యపోయారు. తమకు తెలియకుండా తమ ప్రాంతంలో కుందేళ్లు, జింకలు, నెమళ్లు ఎక్కడ తిరుగుతున్నాయని అన్వేషించి విఫలమయ్యారు. పెద్దపెద్ద కుంభకోణాలు జరిగిపోతున్నాయని వైఎస్‌ హయాంలో టీడీపీ నేతలు కథనాలు రాయించారు. మరి అప్పుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినలేదా?. ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వారికి రాష్ట్ర ప్రతిష్ట అన్నది అధికారంలో ఉన్నప్పుడే గుర్తుకు వస్తాయా ?. అసలు తమపై కథనాలు రాసే హక్కు ఎవరిచ్చారని అమాయకంగా ప్రశ్నించారు. అవినీతి చేస్తే కథనాలు రాసే హక్కు ఏ మీడియా సంస్థకైనా ఉంటుందన్న విషయం సీనియర్ ఎమ్మెల్యే గారు మరిచిపోవడమే ఆశ్చర్యం.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News