14ఏళ్ల‌లో ఒక్క ఆబ్సెంటూ లేదు!

ఇది నిజంగా అద్భుత‌మే. చంద్ర‌జ గుహ అనే 12వ త‌ర‌గ‌తి విద్యార్థినికి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు. ఎల్‌కెజి, యూకెజితో క‌లిపి మొత్తం 14 సంవ‌త్స‌రాల ఆమె విద్యార్థి జీవితంలో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టింది లేదు. కోల్‌క‌తాలోని డ‌మ్‌డ‌మ్ ఆక్సిలియం కాన్వెంట్‌లో చ‌దువుతున్న చంద్ర‌జ గుహ ఈ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. చంద్ర‌జ ఇత‌ర పిల్ల‌ల‌కు మార్గ‌ద‌ర్శకంగా నిలిచింద‌ని ఆమెకి చ‌దువుచెప్పిన ఉపాధ్యాయులు, స్కూలు ప్రిన్స్‌పాల్ మెచ్చుకోగా, చంద్ర‌జ త‌ల్లితండ్రులు ఇదంతా […]

Advertisement
Update:2016-03-06 18:31 IST

ఇది నిజంగా అద్భుత‌మే. చంద్ర‌జ గుహ అనే 12వ త‌ర‌గ‌తి విద్యార్థినికి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు. ఎల్‌కెజి, యూకెజితో క‌లిపి మొత్తం 14 సంవ‌త్స‌రాల ఆమె విద్యార్థి జీవితంలో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టింది లేదు.

కోల్‌క‌తాలోని డ‌మ్‌డ‌మ్ ఆక్సిలియం కాన్వెంట్‌లో చ‌దువుతున్న చంద్ర‌జ గుహ ఈ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. చంద్ర‌జ ఇత‌ర పిల్ల‌ల‌కు మార్గ‌ద‌ర్శకంగా నిలిచింద‌ని ఆమెకి చ‌దువుచెప్పిన ఉపాధ్యాయులు, స్కూలు ప్రిన్స్‌పాల్ మెచ్చుకోగా, చంద్ర‌జ త‌ల్లితండ్రులు ఇదంతా త‌మ కుమార్తె కృషేనంటున్నారు. ఈ వార్త ఈ స‌మ‌య్ అనే ఆన్‌లైన్ ప్ర‌తిక‌లో రావ‌డంతో ప‌శ్చిమ బెంగాల్ విద్యా శాఖా మంత్రి పార్థ చ‌ట‌ర్జీ ఆమెను త‌మ కార్యాల‌యంకి పిలిపించి స‌ర్టిఫికేట్ ప్ర‌దానం చేశారు. భ‌విష్య‌త్తులో చంద్ర‌జ చ‌దువుకి ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంద‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌జ హాజ‌రులోనే కాదు, చ‌దువులోనూ ముందే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమెకు 90మార్కుల‌కు త‌క్కువ ఏ స‌బ్జ‌క్టులోనూ రాలేదు. చంద్ర‌జ గుహ నిజంగా త‌న‌తోటి విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శ‌కురాలే.

Tags:    
Advertisement

Similar News