చేతులు జోడించి వేడుకున్నా " మేడమ్ మానవత్వం మరిచారా?

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆమె మానవత్వంపైనే విమర్శలు వస్తున్నాయి. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ చేతులు జోడించి వేడుకున్నా కేంద్ర మంత్రి కనికరించలేదన్నది ఇప్పుడు ఆరోపణ. శనివారం రాత్రి అగ్రాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమన్నది ఆరోపణ. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన డాక్టర్ ఒకరు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీ అమానవీయంగా వ్యవహరించారని మృతిచెందిన డాక్టర్ […]

Advertisement
Update:2016-03-07 11:46 IST

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆమె మానవత్వంపైనే విమర్శలు వస్తున్నాయి. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ చేతులు జోడించి వేడుకున్నా కేంద్ర మంత్రి కనికరించలేదన్నది ఇప్పుడు ఆరోపణ.

శనివారం రాత్రి అగ్రాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమన్నది ఆరోపణ. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన డాక్టర్ ఒకరు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో స్మృతి ఇరానీ అమానవీయంగా వ్యవహరించారని మృతిచెందిన డాక్టర్ కూతురు మీడియా ముందు ఆవేదన చెందారు.

”స్మృతీ ఇరానీ కాన్వాయ్‌లోని కారు మా కారును ఢీకొట్టింది. విషయం తెలుసుకుని స్మృతి ఇరానీ బయటకు వచ్చారు. సాయం చేయమని చేతులు జోడించి వేడుకున్నా. కానీ ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోయారు” అని డాక్టర్ కూతురు మీడియా ముందు వాపోయారు. తన సోదరి ఎంతగా వేడుకున్నా ఇరానీ సాయం చేయలేదని మృతుడి కుమారుడు కూడా చెప్పారు.

బాధితుల ప్రకటనతో స్మృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే ఇంత దారుణంగా ఎలా వ్యవహరించగలిగారని, మంత్రికి మానవత్వం ఏమైందని పలువురు మండిపడుతున్నారు. అయితే స్మృతి ఇరానీ శాఖ అధికారులు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. అసలు ప్రమాదానికి, మంత్రి కాన్వాయ్‌కి సంబంధమే లేదని వాదిస్తున్నారు. మంత్రి కాన్వాయ్‌ రావడానికి ముందే అక్కడ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. విషయం తెలియగానే వెంటనే అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేయించామని అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన ఏడు గంటల వరకు మాకు ఎలాంటి సహాయం అందలేదని చనిపోయిన డాక్టర్ కూతురు చెబుతోంది. మేము అడిగినప్పుడే స్మృతిఇరానీ సహాయం చేసి వుంటే మా నాన్నను త్వరగా హాస్పటల్ కి తీసుకువెళ్లడానికి వీలయ్యేదని, మా నాన్న బ్రతికేవాడని కళ్లనీళ్లతో చెప్పింది.

Tags:    
Advertisement

Similar News