"జెమిని" విలన్ కన్నుమూత
ప్రముఖ నటుడు కళాభవన్ మణి కన్నుమూశారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా మణి బాధపడుతున్నారు. కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మణి నటుడు మాత్రమే కాదు జానపద గీతాలను ఆలపించడంలోనూ మేటి. తొలుత మిమిక్రి ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి … అనంతరం సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషా చిత్రాల్లోనూ ఆయన నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన జెమిని సినిమాలో కళాభవన్ మణి విలన్‌గా పండించిన […]
ప్రముఖ నటుడు కళాభవన్ మణి కన్నుమూశారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా మణి బాధపడుతున్నారు. కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మణి నటుడు మాత్రమే కాదు జానపద గీతాలను ఆలపించడంలోనూ మేటి. తొలుత మిమిక్రి ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి … అనంతరం సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషా చిత్రాల్లోనూ ఆయన నటించారు.
వెంకటేశ్ హీరోగా నటించిన జెమిని సినిమాలో కళాభవన్ మణి విలన్‌గా పండించిన నటన అందరినీ అబ్బురపరిచింది. కమేడియన్‌గా, విలన్‌గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. కొన్ని మళయాల సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కేరళలోని చలక్కుడి అనే ప్రాంతానికి చెందిన కళాభవన్ నటుడు కాకముందు ఆటో డ్రైవర్ గా చేసేవారు.