ఆపరేషన్ రెడ్డి … ఇప్పుడు రూపం మారిందెందుకు?

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును తగ్గినట్టుగా ఉంది. మొదట్లో వైసీపీ ఏమైపోతుందో అన్న రేంజ్‌లో ఆకర్ష్‌ యంత్రాన్ని నడిపిన టీడీపీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేల స్టామినా కన్నా స్కోర్ బోర్డును నమ్ముకున్నట్టుగా ఉంది. రాయలసీమలో జగన్‌ బలాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు, బలమైన ఎమ్మెల్యేలపై టీడీపీ ఫోకస్ పెట్టిందని చెప్పారు. అన్నట్టుగా భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి లను వలలో వేసుకున్నారు. అఖిల ప్రియ ఎమ్మెల్యే అయినా ఆమె తండ్రిచాటు నాయకురాలే.  ఇక్కడి వరకు బాగానే ఉంది. భూమా, ఆది […]

Advertisement
Update:2016-03-02 07:17 IST

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును తగ్గినట్టుగా ఉంది. మొదట్లో వైసీపీ ఏమైపోతుందో అన్న రేంజ్‌లో ఆకర్ష్‌ యంత్రాన్ని నడిపిన టీడీపీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేల స్టామినా కన్నా స్కోర్ బోర్డును నమ్ముకున్నట్టుగా ఉంది. రాయలసీమలో జగన్‌ బలాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు, బలమైన ఎమ్మెల్యేలపై టీడీపీ ఫోకస్ పెట్టిందని చెప్పారు. అన్నట్టుగా భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి లను వలలో వేసుకున్నారు. అఖిల ప్రియ ఎమ్మెల్యే అయినా ఆమె తండ్రిచాటు నాయకురాలే. ఇక్కడి వరకు బాగానే ఉంది.

భూమా, ఆది మినహాయిస్తే ఇప్పటి వరకు టీడీపీలో చేరిన వారెవరూ సొంత బలం ఉన్నవారు కాదు. సీమలో జగన్ బలాన్ని దెబ్బతీసేంత సీన్ ఉన్న వారు కాదు. అలాంటి వారు వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం కన్నా లాభమే అధికమని చెబుతున్నారు. సిట్టింగ్‌ల మీద వ్యతిరేకత ఉండడం ఖాయం. పైగా ఏమాత్రం వ్యక్తిగత ఇమేజ్ లేని వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ఇమేజ్ లేని వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని టీడీపీ ఏం సాధిస్తుందన్నది అంతుచిక్కని అంశమే.

పైగా చంద్రబాబు చేర్చుకున్న ఎమ్మెల్యేల్లో దళిత వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండడం చర్చనీయాంశమవుతోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసినట్టుగా భావిస్తున్నారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వీరంతా వెనుకబడిన వార్గాలకు చెందిన వారే. జలీల్ ఖాన్ మైనార్టీ వర్గానికి చెందిన వారు.

మొత్తం మీద టీడీపీ పట్టింపులకు పోయి ఎమ్మెల్యేల వ్యక్తిగత బలంతో పనిలేదు… సంఖ్య పెరిగితే చాలన్నట్టుగా ఆపరేషన్ ఆకర్ష్‌ రూపాంతరం చెందించినట్టుగా భావిస్తున్నారు. బలమైన ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్న వారిపై టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పనిచేయలేదని అందుకే ఆర్ధికంగా వెనుకబడిన వారిని చంద్రబాబు బృందం టార్గెట్ చేయడం ద్వారా బలవంతంగా పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News